టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ టాలెండెట్ ప్లేయర్. దాంతో పాటు ఇప్పుడు జట్టును విజయపథంలో నడుపుతున్న సారథి. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత బీసీసీఐ రోహిత్‌ను కెప్టెన్‌గా నియమించింది. తర్వాత కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి రోహిత్‌కే వన్డే కెప్టెన్సీ కూడా అప్పగించింది. తాజాగా కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకోవడంతో ఆ బాధ్యతలను కూడా రోహిత్‌కే అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో భారత్ క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు ఏకైక కెప్టెన్ రోహిత్ శర్మనే. అలాగే కెప్టెన్‌గా రోహిత్ రికార్డు కూడా సూపర్. ఐపీఎల్లో సారథ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్‌ను ఐదు సార్లు విజేతగా నిలిపాడు. రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా నాలుగు సిరీస్‌లను వైట్‌వాష్ చేసింది. ఇంతటి టాలెంట్ ఉన్న ఆటగాడికి కెప్టెన్సీ రావడం కాస్త ఆలస్యమైందనే వాదన కూడా ఉంది.
కానీ.. రోహిత్లోని నాయకుడిని ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ఆటగాడు ఆడయ్ గిల్‌క్రిస్ట్ 13 ఏళ్ల క్రితమే గుర్తించాడు. 2009లో గిల్‌క్రిస్ట్ అప్పటి ఐపీఎల్ టీమ్ డెక్కన్ చార్జర్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. రోహిత్ శర్మ ఆ సమయంలో డెక్కన్ చార్జర్స్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. జట్టులో తన బాధ్యతను పటిష్టంగా నిర్వర్తిస్తూ.. కెప్టెన్ గిల్‌క్రిస్ట్‌కు పూర్తిగా సహరించేవాడు. ఇలా రోహిత్లోని కెప్టెన్‌ను గుర్తించిన గిల్‌క్రిస్ట్.. రోహిత్ ఎప్పటికైనా టీమిండియా లీడ్ చేస్తాడని చెప్పాడు. అప్పుడు గిల్‌క్రిస్ట్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోహిత్ టాలెంట్‌ను 13 ఏళ్ల క్రితమే గిల్‌క్రిస్ట్ గుర్తించాడని, అప్పడు అతను చెప్పింది.. ఇప్పుడు నిజమైందంటూ రోహిత్ ఫ్యాన్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నారు. మరి గిల్‌క్రిస్ట్ అంచనాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
2009: “Rohit has taken his vice-captain’s role very seriously and wants to be a leader some day and that is exciting,”- Adam Gilchrist
2022: India’s All-Format captain
— Broken Cricket (@BrokenCricket) February 20, 2022