క్రికెట్‌లో ఏబీ డివిలియర్స్ ఒక సంచలనం.. తనకు మాత్రమే సాధ్యమైన 360 డిగ్రీ యాంగిల్ బ్యాటింగ్‌తో క్రికెట్ రూపురేఖలనే మార్చేసిన ఆటగాడు. బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతూ.. గ్రౌండ్‌కు అన్ని వైపులా సిక్సులు కొట్టి.. సాంప్రదాయ షాట్లకు తూట్లుపొడిన విధ్వంసకర ఆటగాడు. అందుకే అతన్ని అంతా మిస్టర్ 360 ప్లేయర్ అంటూ పిలుస్తారు. తన డిఫరెంట్ బ్యాటింగ్ స్టైల్‌తో క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించిన డివిలియర్స్ క్రికెట్ నుంచి రిటైర్ అయిపోయిన తర్వాత.. అతన్ని ఆటను అభిమానులు మిస్ అవుతున్నారు.
ఈ క్రమంలో టీమిండియా యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ తన సహజశైలిలో ఆడుతూ డివిలియర్స్‌ను తలపిస్తున్నాడు. డివిలియర్స్‌ను అనుకరించాలనే ఉద్దేశం అతనిలో ఏ కోసనా కనిపించదు కానీ.. అతను ఆడుతుంటే మాత్రం డివిలియర్స్‌ను చూసినట్లే ఉంటుంది. అందుకే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్ సైతం ఇటివల సూర్యకుమార్ యాదవ్‌ను ఏబీ డివిలియర్స్‌తో పోల్చాడు. అంతకు ముందు నుంచే సూర్యకుమార్ యాదవ్‌ను ఇండియన్ మిస్టర్ 360 ప్లేయర్ అంటూ అభిమానులు పిలుచుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్‌ను తనతో పోల్చడంపై ఏకంగా డివిలియర్స్ స్పందించాడు. సూర్యకుమార్ యాదవ్ చాలా బాగా ఆడతాడని, అతని బ్యాటింగ్ చూసేందుకు తానెంతో ఇష్టపడతానని డెవిలియర్స్ వెల్లడించాడు. దీంతో సూర్యను తనతో పోల్చడంపై ఏబీడీ సంతోషంగానే ఉన్నట్లు అర్థమవుతోంది. ఇక త్వరలో ఆసియా కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఫామ్‌పై మరోసారి తీవ్ర స్థాయిలో చర్చ మొదలైంది. ఈ విషయంపై కూడా డివిలియర్స్ స్పందించాడు. ‘విరాట్ కోహ్లీతో నేను రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటాను. అయినా అతనో ప్రపంచ స్థాయి అత్యుత్తమ ఆటగాడు. ఎలా ఆడాలో, ఏం చేయాలో అతని ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. అతనికి అన్ని తెలుసు. అలాగే ఫామ్ కోల్పోవడం అనేది తాత్కాలికమే. అతను తిరిగి ఫామ్‌ను తప్పకుండా అందుకుంటాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితిని అతను అధిగమిస్తాడు. అతనికి నా అవసరం ఏమి లేదు.’ అని డెవిలియర్స్ వెల్లడించాడు.
కాగా చాలా కాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న కోహ్లీ.. వెస్టిండీస్, జింబాబ్వే టూర్‌లకు విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. అలాగే ఆసియా కప్‌లో అతని ప్రదర్శన ఆధారంగానే టీ20 వరల్డ్ కప్‌లో అతని చోటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. కోహ్లీ ఆసియా కప్‌లో ఎలా ఆడతాడనే దానిపైనే అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. మరి సూర్యకుమార్ యాదవ్‌ను డివిలియర్స్‌తో పోల్చడం, కోహ్లీ కమ్‌బ్యాక్ గురించి డివిలియర్స్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: వీడియో: డ్రెస్సింగ్ రూమ్‌లో ఒక రేంజ్‌లో రచ్చ చేసిన టీమిండియా ఆటగాళ్లు!
AB De Villiers said, “Suryakumar Yadav looks a fine player, I enjoy watching him bat”. (To NDTV).
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 22, 2022
“Suryakumar (Yadav) scores 360 degrees around the ground, a bit like an AB de Villiers did.” 💬
Ricky Ponting praised the India star on The ICC Review 👇https://t.co/wvMmw4iMtI
— ICC (@ICC) August 16, 2022
AB de Villiers opines on Virat Kohli’s form.
📷: IPL/BCCI#ABdeVilliers #ViratKohli #CricketTwitter pic.twitter.com/A8ThmS6NAx
— CricTracker (@Cricketracker) August 22, 2022
AB de Villiers opens up about Virat Kohli’s rough patch.#ABdeVilliers #ViratKohli #India #Cricket #RCB #CricketWinner pic.twitter.com/2yEOHYrMFK
— Cricket Winner (@cricketwinner_) August 22, 2022