నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు సభలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 8 మంది మృతి చెందగా.. గుంటూరు చంద్రన్న సభలో ముగ్గురు మృతి చెందారు. చనిపోయిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. ఇంతమంది చనిపోవడంతో చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. వైసీపీ నేతలు సహా ఇతర పార్టీ నేతలు, ప్రజలు సైతం చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితోనే 8 మంది చనిపోయారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. కేఏ పాల్ కూడా చంద్రబాబుని తీవ్రంగా విమర్శించారు. కందుకూరు ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్.. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
ప్రధాని మోదీ సైతం ఈ ఘటనపై స్పందించి ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అయితే గుంటూరులో చంద్రన్న కానుక సభలో ముగ్గురు మృతి చెందడంతో వైఎస్ఆర్సీపీ పార్టీ చంద్రబాబుని క్షమాపణ కోరింది. ‘గుంటూరు చంద్రన్న కానుక సభలో తొక్కిసలాట జరగడంతో ముగ్గురు మృతి చెందారు. బాబు తన ప్రచార యావతో ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటున్నాడు. తాను నాయకుడిని కాదు, నరహంతకుడినని నిరూపిస్తున్నాడు. తొక్కిసలాటలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని, ఇందుకు కారణమైన బాబు క్షమాపణ చెప్పాలని వైయస్ఆర్‌సీపీ డిమాండ్ చేస్తోంది’ అంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది. మరి తొక్కిసలాట జరిగి ఇంతమంది చావులకు కారణమైన సభలపై, ఆ సభలను నిర్వహించిన వారిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.
బాబు తన ప్రచార యావతో ప్రజల ప్రాణాలు బలితీసుకుంటున్నాడు. తాను నాయకుడిని కాదు నరహంతకుడినని నిరూపిస్తున్నాడు. తొక్కిసలాటలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని, ఇందుకు కారణమైన బాబు క్షమాపణ చెప్పాలని వైయస్ఆర్‌సీపీ డిమాండ్ చేస్తోంది. @ncbn#PoorLivesMatter #NaraHanthakuduCBN pic.twitter.com/IwUJaykNXJ
— YSR Congress Party (@YSRCParty) January 3, 2023