తారకరత్న నివాసానికి చేరుకున్న బాలకృష్ణను ఎంపీ విజయసాయిరెడ్డి పరామర్శించారు. తారకరత్న మృతితో చింతిస్తున్న బాలయ్యను విజయసాయిరెడ్డి ఓదార్చారు.
నందమూరి తారకరత్న మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. తారకరత్న నివాసానికి చేరుకొని ఆయన భౌతిక కాయాన్ని సందర్శిస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ వంటి సినీ ప్రముఖులు తారకరత్న భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. పలువురు రాజకీయ నేతలు కూడా తారకరత్న నివాసానికి చేరుకుని నివాళులు అర్పించారు. తారకరత్న కుటుంబ సభ్యులను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పరామర్శించారు. నందమూరి బాలకృష్ణను కూడా విజయసాయిరెడ్డి పరామర్శించారు. తారకరత్న మరణంతో చింతిస్తున్న బాలకృష్ణను విజయసాయిరెడ్డి ఓదార్చారు.
తారకరత్న నివాసానికి చేరుకోగానే తారకరత్నకు నివాళులు అర్పించారు. అనంతరం విజయసాయిరెడ్డిని ఆలింగనం చేసుకుని ఆయన పక్కన కూర్చున్నారు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. విజయసాయిరెడ్డి చెప్తున్నంతసేపు బాలయ్య చాలా శ్రద్ధగా వింటూ వచ్చారు. బాలకృష్ణ కూడా విజయసాయిరెడ్డితో మాట్లాడారు. తారకరత్న మృతి గురించే మాట్లాడి ఉండవచ్చుననిపిస్తుంది. వ్యతిరేక పార్టీలకు చెందిన నేతలు కావడంతో వీరిరువురూ ఇలా పక్కపక్కన కనబడడంపై ఆసక్తి ఏర్పడింది. ఒక పక్కన తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు, మరోపక్క వైసీపీ పార్టీకి చెందిన నాయకుడు ఇలా ఒకే వేదికపైన పక్కపక్కన కనబడుతుండడం ఆసక్తి రేపుతోంది.
తారకరత్న కోసం పార్టీలకు అతీతంగా ఇంతమంది వస్తున్నారంటే అది తారకరత్న గొప్పతనం అని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే అభిమానుల సందర్శనార్థం తారకరత్న పార్థివ దేహాన్ని సోమవారం ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచనున్నారు. సోమవారం సాయంత్రం ఫిల్మ్ నగర్ లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా బాలకృష్ణ తారకరత్న భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం విజయసాయిరెడ్డితో మాట్లాడారు. విజయసాయిరెడ్డి బాలకృష్ణను ఓదార్చారు. మరి బాలకృష్ణను విజయసాయిరెడ్డి పరామర్శించడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.