కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురై య్యారు. దాంతో ఆమెను హుటాహుటిన ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రికి తరలించారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురై య్యారు. దాంతో ఆమెను హుటాహుటిన ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రికి తరలించారు. గురువారం ఆమె అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. గంగా రామ్ ఆసుపత్రి వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించారు. అనంతరం సోనియా గాంధీ జ్వరంతో బాధపడుతున్నట్లు ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ ను విడుదల చేశాయి.ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. కాగా సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరడం ఈ ఏడాదిలో ఇది సెకండ్ టైమ్ కావడం గమనార్హం. గతంలో శ్వాసకోశ సంబంధిత సమస్య కారణంగా జనవరిలో ఆమె హాస్పిటల్ లో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు.
ఈ క్రమంలోనే కరోనా తర్వాత పలు అనారోగ్య సమస్యలతో సోనియా గాంధీ బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆమె గత కొన్ని రోజులుగా ఊపిరితిత్తులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు.ఇక తాజాగా మరోసారి సోనియా గాంధీ అస్వస్థతకు లోనైయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఆమె అస్వస్థతకు లోనైనట్లు సమాచారం. ఇక సోనియా అనారోగ్య వార్త తెలియగానే దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అయితే వైద్యులు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రమాదం ఏమీ లేదని, సోనియా ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలపడంతో కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. ఇక కొన్ని రోజుల క్రితం జరిగిన కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ వేడుకల్లో సోనియా పాల్గొన్నారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు ఈ ప్లీనరీలో పరోక్షంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సోనియా గాంధీ వయసు 76 సంవత్సరాలు. ఇక రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వ్యాఖ్యానించారు సోనియా గాంధీ. ఈ నేపథ్యంలోనే ఆమె రోజుల వ్యవధిలో రెండు సార్లు అస్వస్థతకు గురికావడం జరిగింది.