ఛత్తీస్‌గఢ్ లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీలో సోనియా రెండోరోజు ప్రసంగించారు. ఈ సందర్భంగా తన రాజకీయ గురించి సంచలన ప్రకటన చేశారు. పీన్లరీలో ఆమె భావోద్వేగంగా ప్రసంగించారు.
ఛత్తీస్‌గఢ్ లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీలో ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు, సీనియర్ నేత సోనియా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయలకు గుడ్ బై చెప్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఈ క్రమలో భావోద్వేగంగా ప్రసంగించారు. భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్‌ను ముగిస్తుండటం సంతోషంగా ఉందన్నారు సోనియా గాంధీ. ఈ నేపథ్యంలో ఆమె రిటైర్మెంట్పై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇటీవలే ముగిసిన భారత జోడో యాత్రతో తన రాజకీయ ఇన్నింగ్స్ ముగిసిందనే ఆమె సంకేతాలు ఇచ్చారు. భారత్ జోడో యాత్రను.. పార్టీ చరిత్రలోనే ఓ కీలక మలుపుగా సోనియా గాంధీ అభివర్ణించారు.
మూడు రోజుల కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు ఛత్తీస్‌గఢ్ రాజధానీ రాయ్‌పూర్‌లో శుక్రవారం మొదలయ్యాయి. రెండో రోజు కార్యకలాపాల్లో భాగంగా 15వేల మంది పార్టీ సభ్యులు పాల్గొన్నారు. వారిని ఉద్దేశిస్తూ సోనియా గాంధీ ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ.. “భారత్ జోడో యాత్రతో నా రాజకీయ ఇన్నింగ్స్ ముగించడం నాకు సంతోషాన్నిచ్చే విషయం. భారత్ జోడో యాత్ర.. పార్టీకి టర్నింగ్ పాయింట్ అవుతోంది. దేశంలో శాంతి, సామరస్యాన్ని ప్రజలు కోరుకుంటున్నారని రుజువైంది. 2004, 2009 యూపీఏ పాలన తనకు సంతృప్తి నిచ్చింది. 2024 ఎన్నికలు దేశానికి, కాంగ్రెస్ కి పరీక్షలు” అని సోనియా గాంధీ వ్యాఖ్యానించారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి, దేశానికి కూడా ప్రస్తుతం సవాలతో కూడిన సమయమని, దేశంలోని అన్ని వ్యవస్థలనూ బీజేపీ తమ అధీనంలోకి తీసుకుని అస్తవ్యస్తం చేస్తుందని ఆమె మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం కొద్దిమంది వ్యాపారవేత్తలకు అనుకూలంగా వ్యవహరించడం దేశ ఆర్థిక పతనానికి కారణమవుతోందని ఆమె తెలిపారు. జోడో యాత్ర ప్రజలతో మమేకమై గొప్ప వారసత్వాన్ని పునరుద్ధరించిందని, కాంగ్రెస్ ప్రజలతో ఉందని.. వారి కోసం పోరాడటానికి సిద్ధంగా ఉందని నిరూపించిందని సోనియా అన్నారు. ఈ యాత్ర కోసం కష్టపడి పనిచేసిన పార్టీ కార్యకర్తలందరినీ తాను అభినందిస్తున్నానని అన్నారు.
2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో 85వ పార్టీ ప్లీనరీ సమావేశాలు ఛత్తీస్ గడ్ లో జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతమైన నేపథ్యంలో ఈ ప్లీనరీకి ప్రాధాన్యత మరింత పెరిగింది. ఈ సమావేశంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ రచించాల్సిన వ్యూహాలు, ఇతర పార్టీలతో పొత్తులు వంటి అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. సమావేశంలో తొలి రోజులో భాగంగా నేతలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు . సీడబ్ల్యూసీకి ఎన్నికలు నిర్వహించకూడదని నిర్ణయుంచుకున్నారు. సభ్యులను నామినేట్ చేసే అధికారాన్ని పార్టీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేకు అప్పగించారు. అయితే తాజాగా సోనియా గాంధీ చేసిన ప్రకటన అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. మరి.. సోనియా గాంధీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
If we look at the last 25 years, our victories in 2004 & 2009 elections along with the able leadership of Dr. Manmohan Singh ji gave me personal satisfaction. What gratifies me the most is that my innings could conclude with the historic Bharat Jodo Yatra.
: Smt Sonia Gandhi Ji pic.twitter.com/QncPOej17G
— Congress (@INCIndia) February 25, 2023