రాజన్న సంక్షేమ పాలన రావాలంటూ తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టింది వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైస్ షర్మిల. అధికార తెరాసకి చుక్కలు చూపిస్తూ కొరకరాని కొయ్యగా మారింది. ఇటీవల తెలంగాణలో వైస్సార్ తెలంగాణ పార్టీని సైతం ప్రారంభించి ప్రస్తుత రాజకీయాల్లో దూకుడు పెంచుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్ లోని మీడియా సమావేశంలో పాల్గొన్న ఆమె తెలంగాణ మంత్రి కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ విలేకరి ఇలా అడుగుతూ..కేటీఆర్ మీ గురుంచి స్పందించి వారంలో ఒక్కో రోజు ఒకోలా వ్రతాలు చేస్తారని, షర్మిల కూడా అలాగే చేస్తున్నారని, ఆమె గురుంచి అంతగా పట్టించుకొనవసరం లేదని అన్నారని తెలిపారు. వెంటనే ఈ ప్రశ్నకు షర్మిల సమాధానమిస్తూ..కేటీఆర్ అంటే..అయన ఎవరు అసలు?..హో కెసిఆర్ కొడుకా అంటూ సెటైరికల్ పంచ్ లు వేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి అసలు మహిళల గురించే పట్టించుకోరు, ఇక అలాంటిది అయన కొడుకు కేటీఆర్ ఎలా పట్టించుకుంటారని అన్నారు. రాష్ట్రంలో మహిళలను వంటింటికి మాత్రమే పరిమితం చేస్తున్నారని మండిపడింది. నేను వారానికి ఒకసారి ప్రజల సమస్యలపై దీక్ష చేస్తుంటే మీకు వ్రతంలా అనిపిస్తుందా అంటూ కేటీఆర్ ను ప్రశ్నించింది. తెలంగాణ మంత్రి వర్గంలో అసలు మహిళలలే లేరని ఇక్కడే వాళ్ళు మహిళలకు ఇచ్చే గౌరవం తెలిసిపోతుందని అన్నారు.
మన రాష్ట్రంలో మహిళా సర్పంచులకు గౌరవం ఇవ్వరని, తెరాస పార్టీ ఏదైనా సమావేశం జరిగితే ఆ కార్యక్రమంలో మహిళలు ఒక్కరైనా కనిపిస్తారా అంటూ ప్రశ్నించింది షర్మిల. మన సీఎం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై, కెసిఆర్ పై కొట్లాడతామని తెలిపారు. దీంతో పాటు రాబోయే రోజుల్లో చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నామని ప్రకటన చేశారు షర్మిల. ఇక నేను పాదయాత్ర చేస్తున్నాని తెలుసుకుని మరికొన్ని తెలంగాణ రాజకీయ పార్టీలు కూడా చేస్తున్నాయని అన్నారు.