భారతదేశంలో రాజకీయాలకు, క్రీడలకు విడదీయరాని సంబంధం ఉంది. క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన తర్వాత చాలా మంది ఆటగాళ్లు ఏదో ఒక విధంగా రాజకీయాల్లోకి రావడం మనం చూస్తూనే ఉన్నాం. అజారుద్దీన్, సచిన్, గౌతమ్ గంభీర్ లాంటి మరికొంత మంది ఆటగాళ్లు చట్ట సభలకు సైతం ప్రాతినిథ్యం వహించిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తన భార్య గెలుపు కోసం జోరుగా ప్రచారం సాగిస్తున్నాడు టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. భార్య రివాబా జడేజా జామ్ నగర్ నార్త్ నుంచి బీజేపీ తరపున MLA గా పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అందులో భాగంగానే జడేజా జోరుగా ప్రచారం సాగిస్తూ.. ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
જન જનનો મળી રહ્યો છે મીઠો આવકાર,
કેસરિયા કરવા જામનગર ફરી વાર તૈયાર…ભારત દેશ નુ અને જામનગર શહેર નુ ગૌરવ જેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી દેશ નું અને જામનગર નું ગૌરવ વધારેલ તેવા ઓલ રાઉન્ડર ક્રિકેટર શ્રી @imjadeja નો ભવ્ય રોડ શો. 1/1 pic.twitter.com/jL2Dp6Z2cw
— Rivaba Ravindrasinh Jadeja (@Rivaba4BJP) November 22, 2022
రవీంద్ర జడేజా.. ఇన్ని రోజులు టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించిన జడేజా.. ప్రస్తుతం తన భార్య రివాబా విజయం కోసం శ్రమిస్తున్నాడు. జామ్ నగర్ నార్త్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న రివాబా గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాడు జడేజా. రోడ్డు షోలు, ర్యాలీలు, సభలతో ప్రచారంలో జోరు కొనసాగిస్తున్నాడు. మరో వైపు రివాబా సైతం ప్రచారంలో ఎంతో ఉత్సాహంగా దూసుకెళ్తోంది. ఇక జడేజా ప్రచారంలో భాగంగా..”నియోజకవర్గ ప్రజాలు అద్భుతమైన స్వాగతం పలుకుతున్నారు. మరోసారి జామ్ నగర్ కుంకుమ పూజకు సిద్దమైంది” అంటూ రోడ్ షోలో ప్రసంగించాడు. ప్రచారానికి తక్కవ రోజులే ఉండటంతో అటు ప్రత్యర్థి సైతం.. దూకుడు కొనసాగిస్తోంది. కాంగ్రెస్ తరపున జడేజా సోదరి నైనా జడేజా బరిలో ఉంది. దాంతో ఈ సారి జామ్ నగర్ ఎన్నికల వైపే దేశం మెుత్తం చూస్తోంది. డిసెంబర్ 1న 89 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. మిగిలిన స్థానాలకు డిసెంబర్ 5న రెండో విడతగా ఎన్నికలు నిర్వహించనున్నది ఎన్నికల కమిషన్. ప్రస్తుతం ఈ ప్రచారానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
વોર્ડ નં ૧૫ માં લોકસંપર્ક દરમ્યાન શાલિગ્રામ હોસ્પિટલ ના ડો. કેવિનભાઈ વિરાણી સાહેબ અને તેમની સમસ્ત મેડિકલ અને પેરામેડિકલ ટીમે મારું ભાવભર્યુ સ્વાગત કરી અભિવાદન કરવા બદલ હું સમગ્ર શાલિગ્રામ હોસ્પિટલ ની કૃતાર્થ છું..#કમળ_ખીલશે_ગુજરાત_જીતશે#ભાજપ_સાથે_અગ્રેસર_જામનગર_ઉત્તર pic.twitter.com/3Dg4kAubFP
— Rivaba Ravindrasinh Jadeja (@Rivaba4BJP) November 23, 2022
જામનગર ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા દ્વારા ભવ્ય સંમેલન, જેમા મુખ્ય અતિથિ માનનીય કેન્દ્રિય મંત્રીશ્રી @PRupala જી, શહેર અધ્યક્ષ શ્રી વિમલભાઈ કગથરા, ૭૭-૭૮-૭૯ ચૂંટણી ઇન્ચાર્જ પૂર્વ મંત્રી શ્રી Dharmendrasinh Jadeja (Hakubha), મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, 1/1 pic.twitter.com/Dp5JqkGR0X
— Rivaba Ravindrasinh Jadeja (@Rivaba4BJP) November 21, 2022