వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ముఖ్యమంత్రి అయ్యాక.. ఆంధ్రప్రదేశ్ అప్పులు.. భారీగా పెరిగాయని.. కొన్ని రోజుల క్రితం వరకు విపక్షాలు గగ్గోలు పెట్టాయి. ఏకంగా జగన్ పాలనలో ఏపీ అప్పులు 10 లక్షల కోట్ల రూపాయలు దాటాయని అసత్య ప్రచారం చేస్తూ.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారు ప్రత్యర్థులు. అంతేకాక.. ఏపీ మరో శ్రీలంక అవుతుందని.. సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయితే.. ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్తుందంటూ విమర్శలు చేశారు. ప్రభుత్వం మాత్రం.. చంద్రబాబు పాలనకాలంతో పోలిస్తే.. తమ హయాంలో.. తక్కువ అప్పులు చేశామని క్లారిటీ ఇచ్చింది ఇక తాజాగా కేంద్ర ప్ఱభుత్వం.. పార్లమెంట్ సాక్షిగా.. రాష్ట్రాల అప్పుల వివరాలను వెల్లడించడంతో.. విపక్షాలు నోరు మూశాయి. మరి ఇంతకు కేంద్రం వెల్లడించిన అప్పలు జాబితాలో… రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏది ముందు జాబితాలో ఉంది.. ఏపీ అప్పలకు సంబంధించిన ఎలాంటి వివరాలు వెల్లడించింది అంటే..
కేంద్రప్రభుత్వం.. పార్లమెంట్ సాక్షిగా.. దేశాంలోని వివిధ రాష్ట్రాల అప్పుల వివరాలను వెల‍్లడించింది. బీఆర్‌ఎస్ ఎంపీలు అడిగినకేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌధరి సోమవారం పార్లమెంట్‌లో వివిధ రాష్ట్రాల అప్పలు వివరాలు వెల్లడించారు. ఈ నివేదిక చూస్తే.. విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఎంత అవాస్తవం ఉందో అర్థం అవుతుంది. మంత్రి వ్లెలడించిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ అప్పు 2022 మార్చి నాటికి రూ.3,98,903.60 కోట్లుగా ఉంది. ఇక ఈ మొత్తంలో.. 2018 వరకే రూ.2.60 లక్షల కోట్లు అప్పు ఉందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. గడిచిన నాలుగేళ్లల్లో.. ఏపీ లక్షా 40 వేల కోట్లు అప్పు చేశారని వివరించారు.
కేంద్రం వెల్లడించిన వివరాలతో అధికార పార్టీకి బలమైన ఆయుధం లభించినట్లు అయ్యింది. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో అంటే 2014-2018 వరకు.. 2.60 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఇక ఆయన హయాంలో.. ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు కాలేదు. ప్రజల దగ్గర నుంచి వీలైనంత మేర వసూలు చేశాడు. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్.. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. పేద, బడుగు, బలహీన వర్గాల వారి అభివృద్ధికి కృషి చేస్తున్నాడు. కానీ విపక్షాలు మాత్రం.. జగన్ అప్పులు చేసి పంచుడు పథకాలు ప్రారంభించాడని.. ఇప్పటికే పది లక్షల కోట్లు అప్పు చేశాడని ఆరోపించాయి. కానీ తాజాగా కేంద్రం ప్రభుత్వం విడుదల చేసిన నివేదికతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
జగన్ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చినప్పటికి.. ఈ నాలుగు ఏళ్ల కాలంలో ఆయన చేసిన అప్పులు.. చంద్రబాబు హయాంలో చేసిన అప్పుల కన్నా తక్కువే. పైగా ఇలా సమకూర్చిన మొత్తాన్ని ప్రజా సంక్షేమం కోసమే ఖర్చు చేశాడు. కానీ చంద్రబాబు హయాంలో.. ఇప్పుడన్నన్ని సంక్షేమ పథకాలు లేవు. ఉన్న పథకాలు అమలు తీరు కూడా సరిగా లేదు. అయినా సరే.. టీడీపీ హయాంలో ఏకంగా 2.60 లక్షల కోటుల అప్పులు చేశారంటే.. ఆ మొత్తం ఏమయ్యింది.. ఎవరి జేబుల్లోకి వెళ్లిందో.. కేంద్ర నివేదికతో అందరికి స్పష్టంగా అర్థం అయ్యింది అంటున్నారు వైసీపీ క్యాడర్. కేంద్రం వెల్లడించిన వివరాలు చూసి.. విపక్షాలకు ఏం మాట్లాడాలో.. ఎలా కౌంటర్ చేసుకోవాలో అర్థం కాకుండా ఉంది. ఏపీ అప్పులకు సంబంధించి కేంద్రం విడుదల చేసిన జాబితాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.