చిత్తూరు– వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకుని.. సమాజానికి మేలు చేసే పనులు చేస్తానని గతంలో ప్రకటించారు. ఆ నిర్ణయానికి కట్టుబడుతూ.. నేడు వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఓ మంచి పనికి ఎమ్మెల్యే రోజా శ్రీకారం చుట్టారు.
ఇవి కూడా చదవండి:
బిగ్ బాస్ 5 విన్నర్ VJ సన్నీ ప్రైజ్ మనీతో ఏం చేయబోతున్నాడంటే?
సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న భీమ్లానాయక్..!
ఈ ఏడాది సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా రోజా ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆ గ్రామం మీరాసాహెబ్ పాలెం. నగరి నియోజకవర్గంలో.. తమిళనాడు సరిహద్దులో మారుమూల పల్లెటూరు ఇది. మౌలిక సదుపాయాల కొరత అధికం. ఇక్కడ ముస్లిం జనాభా ఎక్కువగా ఉంటారు. చదువుకున్న వారు చాలా తక్కువ. ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు రోజా. తన సొంత నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని, మౌలిక సదుపాయాలు కల్పిస్తానని ఎమ్మెల్యే రోజా తెలిపారు.
గతేడాది జగన్ పుట్టిన రోజు సందర్భంగా రోజా పుష్పకుమారి అనే పేద విద్యార్థినిని దత్తత తీసుకుని.. చదివించారు. తల్లిదండ్రులను కోల్పోయి.. అనాథగా మారిన తనకు అండగా నిలిచిన రోజా గర్వించేలా చేశారు పుష్పకుమారి. నీట్లో అద్భుత ప్రతిభ చూపి.. 89 శాతం మార్కులు సాధించారు. మరి.. ఎమ్మెల్యే రోజా ఇలాంటి మంచి కార్యక్రమాల్లో భాగం అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.