ఏపీలోని ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటనపై కాస్త స్పష్టత వచ్చినట్లు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. గత కొన్నేళ్ల నుంచి పీఆర్సీపై ప్రకటనపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయిని విషయం తెలిసిందే. దీంతో ఉద్యోగ సంఘాల నేతలో పాటు ఉద్యోగులు సైతం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఈ దిశగా అనేక సార్లు సీఎం జగన్ కు ఉద్యోగ సంఘాల నేతలు పీఆర్సీపై వివరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న జగన్ ను కొందరు ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు.
పీఆర్సీపై వివరించి తొందరగా నిర్ణయం తీసుకోవాలంటూ తెలిపే ప్రయత్నం చేశారు. దీంతో వారి అభ్యర్థనను స్వీకరించిన సీఎం జగన్.. పది రోజుల్లోగా పీఆర్సీపై ప్రభుత్వం కీలక ప్రకటన వెలువరిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. దీనిపై ప్రక్రియ పూర్తైందని కొన్ని రోజుల్లోనే స్పష్టతనివ్వనున్నామని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. దీంతో కొన్నేళ్ల నుంచి పీఆర్సీ ప్రకటన కోసం వేచిచూసిన ఉద్యోగులకు జగన్ తాజా ప్రకటనతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ నిర్ణయంతో త్వరలోనే ఉద్యోగుల కోరిక నెరవేరనుందని తెలుస్తోంది.