ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల బాధితులను కలుసుకున్న ఆయన వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.సీఎం జగన్ చిత్తూరు టూర్ లో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. బాధితులు ఇచ్చి అర్జీలపై సంతకం చేయడానికి తన పక్కన ఉన్న అధికారి వద్ద నుంచి పెన్ను తీసుకున్నాడు.
అది సరిగ్గా పనిచేయకపోయే సరికి సీఎం తానే స్వయంగా ఆ అధికారి జేబులో ఈ పెన్ను పెట్టి మరోక పెన్ను తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న తన సింప్లిసిటి చూపించారని కొందరు తెలిపారు.