మన దేశంలో ఎన్నికలు అంటే పండగ వాతావరణం నెలకొంటుంది. ఆ నెల రోజుల పాటు ఓటర్లను దేవుళ్లలా కొలుస్తారు నేతలు. ఇక ఎన్నికల్లో గెలుపు కోసం నాయకులు.. ఓటర్లను ఎన్ని ప్రలోభాలకు గురి చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో.. వెండి బిస్కెట్లు పట్టుబడటం కలకలం రేపుతోంది. ఆ వివరాలు..
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంది. తెలంగాణలో మూడు, ఆంధ్రప్రదేశ్‌లో 7 ఎమ్సెల్సీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలో ఓటర్లను ఆకర్షించేందుకు నేతలు రకారకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్లని మభ్యపెట్టేందుకు నేతలు చేయని ప్రయత్నం అంటూ లేదు. జనరల్ కాకుండా.. ఈ ఎన్నికల్లో తక్కువ మంది ఓటర్లు ఉండటంతో.. పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దాంతో నేతలు గెలుపు కోసం పోటాపోటీగా ఖర్చు చేస్తున్నారు. ఓటుకు ఏకంగా 10 వేల రూపాయలు ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నారు. ఈ ఎన్నికల్లో సత్తా చాటి తమ బలమేంటో చూపించాలని అన్ని పార్టీలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో భారీ మొత్తంలో వెండి బిస్కెట్లు పట్టుబడటం స్థానికంగా కలకలం రేపుతోంది. ఆ వివరాలు..
విశాఖపట్నంలో ఈ వెండి బిస్కెట్లు వెలుగులోకి వచ్చాయి. గిఫ్ట్ బాక్సుల్లో వేల సంఖ్యలో ప్యాక్ చేసి ఉన్న వెండి బిస్కెట్లు పట్టుబడటం కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల కావడంతో.. కొందరు నేతలు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేల సంఖ్యలో బిస్కెట్లు ప్యాక్ చేసి ఉన్నట్లు గుర్తించారు. కానీ అధికారులు మాత్రం దీనిపై ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. ఇక పట్టుబడిన వెండి బిస్కెట్లు.. ఒక్కొక్కటి సుమారు 15 గ్రాముల వరకు ఉన్నాయి.
ఇక ఏపీలో 14 ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. 8 స్థానిక సంస్థల్లోని 9 నియోజకవర్గాలు, మూడు పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. అయితే, 9 స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో 5 స్థానాలు అధికార వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. దీంతో మరో 4 స్థానిక సంస్థల నియోజకవర్గాల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే మూడు పట్టభద్రులు, రెండు టీచర్ల ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 13న అనగా సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. మూడు రోజుల తర్వాత అనగా మార్చి 16న ఓట్ల లెక్కించి.. ఫలితాలు ప్రకటిస్తారు. మరి నేతలు ఇలా ప్రలోభాలకు గురి చేయడం, ఓటర్లు అమ్ముడుపోవడం సరైందేనా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.