స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించింది. ఎన్నికలు జరిగిన 4 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే ఘన విజయం సాధించారు. ఏపీలో స్థానిక సంస్థల కోటాలో మొత్తం 9 స్థానాలకు నోటిఫికేషన్ వెలువడగా.. వైసీపీ అభ్యర్థులు 5 స్థానాల్లో ఏకగ్రీవం అయ్యారు. మిగిలిన 4 స్థానాలకు పోటీ నెలకొనడంతో ఎన్నికలు నిర్వహించారు.
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించింది. ఎన్నికలు జరిగిన 4 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే ఘన విజయం సాధించారు. ఏపీలో స్థానిక సంస్థల కోటాలో మొత్తం 9 స్థానాలకు నోటిఫికేషన్ వెలువడగా.. వైసీపీ అభ్యర్థులు 5 స్థానాల్లో ఏకగ్రీవం అయ్యారు. మిగిలిన 4 స్థానాలకు పోటీ నెలకొనడంతో ఎన్నికలు నిర్వహించారు. ఆ నాలుగు స్థానాలను కూడా వైసీపీనే సొంతం చేసుకుంది. శ్రీకాకుళం నుండి నర్తు రామారావు విజయం సాధించగా, కర్నూలు స్థానంలో మధుసూదన్, ఉమ్మడి పశ్చిమ గోదారి జిల్లాలోని రెండు స్థానాల్లో కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్ విజయం సాధించారు.
ఈ నెల 13న ఏపీలో 3 పట్టభధ్రుల, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు తెలంగాణలోని ఒక ఉపాధ్యాయ స్థానంలో ఎన్నికల పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు భారీ సంఖ్యలో ఉండటంతో తుది ఫలితాలు వెల్లడయ్యే సరికి చాలా సమయం పట్టనుంది. తొలుత స్థానిక సంస్థల కోటా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు వరకు వెలువడిన ఫలితాలను చూస్తే.. అధికార పార్టీ క్లీన్ స్వీప్ చేసే దిశగా సాగుతోంది.
తొలుత శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్లను లెక్కించగా వైసీపీ అభ్యర్థి నర్తు రామారావు విజయం సాధించట్టుగా అధికారులు ప్రకటించారు. ఈ ఎన్నికలో మొత్తం 752మంది స్థానిక సంస్థల ప్రతినిధుల ఓటు పోలవ్వగా.. నర్తు రామారావుకు 632 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి రామకృష్ణకు 108 ఓట్లు వచ్చాయి. 12 ఓట్లు చెల్లనివిగా అధికారులు గుర్తించారు.
పశ్చిమగోదావరి జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ వైకాపా అభ్యర్థులే గెలుపొందారు. వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థులు కవురు శ్రీనివాస్, వంగకా రవీంద్రనాథ్ విజయం సాధించారు. ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలలలో మొత్తం 1,105 ఓట్లకు గానూ.. 1,088 ఓట్లు పోలయ్యాయి. ఇందులో కవురు శ్రీనివాస్‌కు 481 మొదటి ప్రాధాన్యత ఓట్లు దక్కగా, రవీంద్రనాథ్‌కు 460 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి చంద్రశేఖర్‌కు 120 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్సినట్లు అధికారులు ప్రకటించారు.
కర్నూలు స్థానిక సంస్థ ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ మధుసూదన్ విజయం సాధించారు. దీంతో 9 స్థానిక సంస్థల స్థానాలను వైసీపీనే సొంతం చేసుకున్నట్లయ్యింది. కాగా, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు 48 గంటలు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆరు జిల్లాల్లో కలిపి మొత్తం 2లక్షలకు పైగా ఓట్లు పోలయినట్లు సమాచారం. ఈ ఫలితాలపై మీ అభిప్రాయాలనుఁ కామెంట్ల రూపంలో తెలియజేయండి.