ఇటీవల చిన్న సినిమాలైనా, పెద్ద సినిమాలైనా థియేట్రికల్ రిలీజ్ తర్వాత తక్కువ టైంలోనే డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ.. సినిమాలు ఓటిటిలోకి వచ్చాక ఆదరించేవారి సంఖ్య రోజురోజుకూ పెడుతోంది. ఈ క్రమంలో థియేటర్స్ లో చిన్న సినిమాగా రిలీజై.. పెద్ద విజయాన్ని అందుకున్న 'రైటర్ పద్మభూషణ్' మొత్తానికి ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది.
ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలైనా, పెద్ద సినిమాలైనా థియేట్రికల్ రిలీజ్ తర్వాత తక్కువ టైంలోనే డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ.. సినిమాలు ఓటిటిలోకి వచ్చాక ఆదరించేవారి సంఖ్య రోజురోజుకూ పెడుతోంది. ఎందుకంటే.. గత మూడేళ్ళలో జనాలంతా ఎంటర్టైన్ మెంట్ కోసం ఓటిటిలకు అలవాటు పడిపోయారు. అందుకే థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు కూడా ఎప్పుడెప్పుడు ఓటిటికి వస్తాయా? అని చూస్తున్నారు. సినిమా వాళ్ళు ఎలాగో ఆడియెన్స్ ని దృష్టిలో పెట్టుకునే కొన్ని సినిమాలను ముందే ఓటిటిలతో డీల్ కుదుర్చుకొని థియేటర్స్ లోకి తీసుకొస్తున్నారు.
ఇటీవల థియేటర్స్ లో చిన్న సినిమాగా రిలీజై.. పెద్ద విజయాన్ని అందుకున్న ‘రైటర్ పద్మభూషణ్’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. సుహాస్ హీరోగా చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ బ్యానర్ పై ‘మేజర్’ ఫేమ్ అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మించిన ఈ సినిమా.. ఫిబ్రవరి 3న థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. డెబ్యూ డైరెక్టర్ షణ్ముఖ ప్రశాంత్ తెరకెక్కించిన ఈ సినిమా.. కామెడీ, ఎమోషనల్ డ్రామాగా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా సుహాస్ తో పాటు సీనియర్ నటి రోహిణి, ఆశిష్ విద్యార్ధిల పెర్ఫార్మన్స్ లు విశేషంగా ప్రశంసలు అందుకున్నాయి. సుహాస్ కి జోడిగా ఈ సినిమాలో టీనా శిల్పారాజ్ నటించింది.
ఇదిలా ఉండగా.. రైటర్ పద్మభూషణ్ బాక్సాఫీస్ వద్ద ప్రీమియర్స్ నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. పైగా కలెక్షన్స్ కూడా ఊహించని లాభాలను నిర్మాతలకు తెచ్చిపెట్టింది. తాజాగా రైటర్ పద్మభూషణ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అయిపోయింది. ఈ సినిమా ఓటిటి హక్కులను ‘జీ5’ వారు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా.. ఈ సినిమాని ఓటిటి ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చారు. మార్చి 17 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ అవుతున్నట్లు ఇప్పటికే జీ5 కంపెనీ వెల్లడించింది. చూడాలి మరి.. రైటర్ పద్మభూషణ్ ని ఓటిటి ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో! ఇక ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.