ఇటీవల చిన్న సినిమాలైనా, పెద్ద సినిమాలైనా థియేట్రికల్ రిలీజ్ తర్వాత తక్కువ టైంలోనే డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ.. సినిమాలు ఓటిటిలోకి వచ్చాక ఆదరించేవారి సంఖ్య రోజురోజుకూ పెడుతోంది. ఈ క్రమంలో థియేటర్స్ లో చిన్న సినిమాగా రిలీజై.. పెద్ద విజయాన్ని అందుకున్న 'రైటర్ పద్మభూషణ్' మొత్తానికి ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది.