2022 చివరికొచ్చేశాం. మరికొన్ని రోజులు అయితే ఈ ఏడాది పూర్తయిపోతుంది. ఎన్నో అద్భుతమైన సినిమాలను మనకు జ్ఞాపకాలుగా మిగిల్చి, కాలగర్భంలో కలిసిపోనుంది. ఇక ఈ ఏడాది చివరి వారంలోనూ మనల్ని ఎంటర్ టైన్ చేసేందుకు పలు సినిమాలు సిద్ధమైపోయాయి. స్టార్ హీరోల సినిమాలు ఏం లేవు కాబట్టి.. ఈ వారం చిన్నహీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ క్రమంలోనే పలు సినిమాలు నేరుగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయాయి. మరి ఈ లిస్ట్ ఏంటి? ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయో చూద్దాం.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఎప్పటిలానే ఈ వారం కూడా పలు సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. వాటన్నింటి కంటే ‘అన్ స్టాపబుల్’ షోలో ప్రభాస్ ఎపిసోడ్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రోమో, అలరిస్తుండగా ఆహా ఓటీటీ వేదికగా త్వరలో ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. దీనితో పాటు అనుపమ హీరోయిన్ గా చేసిన ‘బటర్ ఫ్లై’ మూవీ డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల కానుంది. డీఎస్పీ, గోల్డ్ లాంటి తెలుగు డబ్బింగ్ సినిమాలు నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తూ, మనల్ని ఎంటర్ టైన్ చేసేందుకు సిద్ధమైపోయాయి.
బ్యూటీ అండ్ ద గీక్ ఆస్ట్రేలియా (ఇంగ్లీష్ సిరీస్ సీజన్ 8) -డిసెంబరు 31