ఈ వారం పలు చిన్న సినిమాలు థియేటర్లలోకి వస్తుండగా.. ఏకంగా 19 చిత్రాల వరకు ఓటీటీలో విడుదలకు సిద్ధమైపోయాయి. మరి ఆ లిస్టు ఏంటి? వాటి సంగతేంటి చూసేద్దామా?
సోమవారం వచ్చిందంటే చాలు అందరూ ఆఫీసులకు వెళ్లే హడావుడిలో పడిపోతారు. అలానే వీకెండ్ ప్లాన్స్ కూడా ఇప్పటినుంచి ప్రిపేర్ చేసుకుంటారు. అందులో భాగంగానే ఈ వారం ఏయే సినిమాలు ఏయే ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి అనే విషయాల్ని తెగ సెర్చ్ చేస్తుంటారు. అయితే మీకు ఆ అవసరం లేకుండా ఈ వారం ఓటీటీ రిలీజయ్యే మూవీస్ లిస్టుతో మీ ముందుకు వచ్చేశాం. ఇందులో తెలుగు సినిమాల దగ్గర నుంచి ఇంగ్లీష్ వెబ్ సిరీసుల వరకు అన్నీ ఉన్నాయి. ఇంతకీ ఆ చిత్రాలేంటి? వాటి సంగతేంటి చూసేద్దామా మరి?
ఇక వివరాల్లోకి వెళ్తే.. గత నెలలో థియేటర్లలో చిన్న చిత్రాలుగా రిలీజై పెద్ద హిట్స్ కొట్టినవి ఏవైనా ఉన్నాయా అంటే అందరూ చెప్పే మాట ‘సార్’, ‘రైటర్ పద్మభూషణ్’. ఈ రెండూ కూడా రెండు డిఫరెంట్ జానర్ మూవీస్. ధనుష్ హీరోగా నటించిన ‘సార్’లో కంటెంట్ తోపాటు సాంగ్స్ కూడా సూపర్ గా ఉండేసరికి హిట్ అయింది. ఇప్పుడు ఆ సినిమానే నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కు సిద్ధమైపోయింది. సుహాస్ హీరోగా నటించిన ‘రైటర్ పద్మభూషణ్’.. జీ5లో స్ట్రీమింగ్ కు రెడీ అయిపోయింది. వీటితో పాటు ‘సత్తిగాని రెండెకరాలు’ లాంటి డైరెక్ట్ ఓటీటీ మూవీతోపాటు పలు వెబ్ సిరీసులు కూడా ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసేందుకు రెడీగా ఉన్నాయి. మరి ఓటీటీలో విడుదలయ్యే పూర్తి జాబితా ఏంటో చూసేద్దామా?