స్టార్ హీరోయిన్ సమంత మెయిన్ రోల్ లో నటించిన మూవీ ‘యశోద’. గత నెల 11న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ప్రేక్షకుల్ని బాగానే ఎంటర్ టైన్ చేసింది. మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నప్పటికీ.. ఇందులో సమంత అద్భుతమైన యాక్టింగ్ తో విశ్వరూపం చూపించింది. సినిమా చాలా నార్మల్ గా ఉన్నప్పటికీ.. తన నటనతో మరో స్థాయికి తీసుకెళ్లింది. మెయిన్ గా చెప్పాలంటే చివర్లో యాక్షన్ సీన్స్ టైంలో ప్రేక్షకులతో విజిల్స్ వేయించింది. ఇక ఈ సినిమా థియేటర్ కి వెళ్లి చూసిన వాళ్లు ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ కూడా ఎంజాయ్ చేసేందుకు టైం ఫిక్స్ అయింది. ‘యశోద’ ఓటీటీ రిలీజ్ అప్డేట్ వచ్చేసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సమంత అనగానే మొన్నమొన్నటి వరకు గ్లామర్ హీరోయిన్ మాత్రమే గుర్తొచ్చేది. కానీ ఇటీవల కాలంలో ఆమె హీరోయిన్ ప్రాధాన్యమున్న చిత్రాలు చేస్తోంది. గతేడాది రిలీజైన ఓటీటీ వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ మ్యాన్ 2’తో సమంతోని మరో యాంగిల్ ని ప్రేక్షకులు చూశారు. అలా చూస్తూ ఉండిపోయారు. ఈ వెబ్ సిరీస్ లో ఆమె చేసిన యాక్షన్ సీక్వెన్స్ చూసి షాకయ్యారు. ఇంకా చెప్పాలంటే ఫిదా అయ్యారు. ఇప్పుడు అలా యాక్టింగ్-యాక్షన్ సీక్వెన్స్ కాంబోలో పడిన సినిమానే ‘యశోద’. గత నెలలో రిలీజైన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీలో వచ్చేందుకు రెడీ అయిపోయింది.
సరోగసి కాన్సెప్ట్ తో తీసిన ఈ సినిమాలో ప్రెగ్నెంట్ గా సమంత యాక్ట్ చేసింది. ఆ తరహా పాత్ర చేస్తూనే ఫైట్స్ కూడా చేయడం విశేషం. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ లాంటి స్టార్ యాక్టర్స్ ఉన్నప్పటికీ.. సమంత ముంద వాళ్లంతా తేలిపోయారు. ఇక ఈ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన దర్శక ద్వయం హరి అండ్ హరీశ్ అద్భుతమని చెప్పలేం కానీ మంచి థ్రిల్లర్ ఎక్స్ పీరియెన్స్ మూవీని అందించారు. ఇక ‘యశోద’ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీతో ఒప్పందం కుదుర్చుకుంది. థియేటర్లలో రిలీజైన నాలుగైదు వారాలకు అంటే డిసెంబరు 9న ‘యశోద’ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఇదే విషయాన్ని తాజాగా ట్వీట్ చేశారు. దీంతో సామ్ ఫ్యాన్స్.. ఈ వీకెండ్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. కచ్చితంగా ‘యశోద’ మూవీ చూసేయాల్సిందేనని ఫిక్స్ అయిపోయారు. మరి మీలో ఎంతమంది ‘యశోద’ని ఓటీటీలో చూసేద్దామని అనుకుంటున్నారు. ఒకవేళ చూస్తే సమంత యాక్టింగ్ మీకెలా అనిపించింది. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
unravel this oh-so-mysterious trap with yashoda 👀#YashodaOnPrime, Dec 9#yashoda #yashodamovie @Samanthaprabhu2 pic.twitter.com/dDDzKsOF4W
— prime video IN (@PrimeVideoIN) December 6, 2022