కొంతమంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా సమంత కూడా ఒక పొస్ట్ పెట్టింది. ఇప్పుడది నెట్టింట తెగ వెరల్ అవుతోంది. అది ఎవరిని ఉద్దేశించి పెట్టిందో తెలియదు కానీ.. ఈ పోస్ట్ పైన చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ అందులో ఏముంది అని సమత ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.
సమంత తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఏమాయ చేశావే సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది. అక్కినేని హీరో నాగ చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ కొన్ని కారణాలవల్ల విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తుంది. విజయ్ దేవరకొండ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఖుషి.సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఇందులో సమంత సరసన విజయ్ నటిస్తున్నాడు. లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమాని తెరకెక్కించారని తెలుస్తోంది.
ఈ మధ్య తనకు ఆరోగ్యం బాగాలేక సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. తనకు సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. తను ఏ పోస్ట్ పెట్టిన క్షణాల్లో వైరల్ అవుతుంది. అయితే తాజాగా పెట్టిన పోస్ట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. తన ఇన్‌స్టాలో రాసుకొస్తూ.. “బొద్దింకను చంపితే హీరో అంటారు. అదే సీతాకోకచిలుకను చంపితే విలన్ అంటారు. ఇక్కడ అందాన్ని బట్టి నైతికత ఆధారపడి ఉంటుంది” అంటూ.. రాసుకొచ్చింది. ఇప్పుడిది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకి ఎవరిని ఉద్దేశించి పెట్టిందో అని నెటిజన్లు జుట్టు పీక్కుంటున్నారు.
ఈ మధ్య ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. విప్లవ్(విజయ్ దేవరకొండ), ఆరాధ్య (సమంత) ప్రేమించుకోవడం.. దీనికి ఇరు కుటుంబాల వారు ఒప్పుకోకపోవడం..ఆ తర్వాత వీరిద్దరూ బయట పెళ్లి చేసుకోవడం.. వివాహమైన తర్వాత ఇద్దరి మధ్య గొడవలు.. లాంటి భావోద్వేగాలతో ఫీల్ గుడ్ గా సాగింది. ప్రేమ, హాస్యం, రొమాన్స్, ఎమోషన్స్ ను ప్రధానంగా చేసుకుని ఈ సినిమా సాగబోతోందని అర్థమవుతోంది. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడానికి అంతా సిద్ధం చేశారు. చూడాలి మరి రిలీజ్ అయ్యాక ఎలాంటి విజయం సాధిస్తుందో. సమంతకి హిట్ పడి చాలా కాలం అయ్యింది. ఈ సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందేమో చూడాలి మరి. విజయ్ దేవరకొండ పరిస్థితి కూడా అలాగే ఉంది. లైగర్ సినిమతో పాన్ ఇండియా రేంజ్‌లో సందడి చేద్దామనుకున్నాడు. కానీ అది బెడిసికొట్టింది. దీంతో ఖుషి మీదనే ఆశలు పెట్టుకున్నాడు విజయ్ . చూడాలి మరి ఈ సినిమాతో అయినా.. వీరిద్దరికి విజయం వరిస్తుందో..లేదో.