ఈ సారి సంక్రాంతికి ఏయే సినిమాలు వచ్చాయి అని అడిగితే.. అందరూ వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు, తెగింపు అని అంటారు. వీటితో పాటే ఓ స్మాల్ బడ్జెట్ మూవీ కూడా రిలీజైంది. ఇన్ని భారీ బడ్జెట్ సినిమాలుండేసరికి ఇది ఆడియెన్స్ మైండ్ లో రిజిస్టర్ కాకుండానే వెళ్లిపోయింది. ఇప్పుడు ఈ సినిమానే ఓటీటీ రిలీజ్ కు రెడీ అయిపోయింది. అధికారికంగా చెప్పలేదు కానీ తేదీ మాత్రం దాదాపు ఫిక్స్ అయిపోయింది. అందుకు సంబంధించిన న్యూస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సింపుల్ కాన్సెప్ట్ తో తీసే సినిమాలు ఒకప్పుడు బిగ్ స్క్రీన్ పై చూసేవారు ఏమో కానీ ఇప్పుడు చాలావరకు ఓటీటీల్లోకి వచ్చాక చూద్దాంలే అని అనుకుంటున్నారు. కానీ సంక్రాంతికి పెద్ద సినిమాలు ఎక్కువయ్యేసరికి ‘కల్యాణం కమనీయం’ మూవీకి పెద్దగా థియేటర్లు దొరకలేదు. నమ్మకం, ప్రేమ ఉన్నప్పుడే పెళ్లి బంధం నిలబడుతుందనే స్టోరీతో అనిల్ కుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. జనవరి 14న థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు నెల రోజులకే ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైపోయింది.
ఆహా ఓటీటీలో ఫిబ్రవరి 17 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది అందుకు సంబంధించి తాజాగా ట్వీట్ కూడా చేశారు. సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఈ సినిమాతో హీరోయిన్ ప్రియా భవాని శంకర్.. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. యాక్టింగ్ తోపాటు లుక్స్ పరంగానూ పక్కంటి అమ్మాయిలా ఉన్న ఈమెని చూసి చాలామంది కుర్రాళ్లు ఫిదా అయ్యారు. ఇప్పుడు సినిమా ఓటీటీ రిలీజ్ ఉందనేసరికి మరోసారి ఈ సినిమా చూసేయాల్సిందేనని అంటున్నారు. మరి ‘కళ్యాణం కమనీయం’ ఓటీటీ రిలీజ్ కోసం మీలో ఎంతమంది వెయిటింగ్? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Prema lekunda pelli cheskovachu kani job lekunda pellante? adhii ee generation lo.🙆🏻♀️🙆🏻♂️#KalayanamKamaneeyamOnAHA, A tale of complicated relationship, premieres Feb 17, only on aha!@santoshsoban @priya_Bshankar @UV_Creations @UVConcepts_ @adityamusic pic.twitter.com/v3SmpJGJp5
— ahavideoin (@ahavideoIN) February 8, 2023