ఓటిటి వేదికలు అందుబాటులోకి వచ్చాక.. ప్రేక్షకులను వినోదాన్ని పొందే మార్గాలను పూర్తిగా మార్చేశారు. ఓటిటిలు లేనప్పుడు అన్ని సినిమాలను థియేటర్స్ లో చూసేందుకు ఆసక్తి చూపేవారు. కానీ.. ఎప్పుడైతే ఓటిటిలు వచ్చాయో.. అప్పటినుండి సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లను సైతం బాగా అలవాటు చేసుకున్నారు. అదీగాక ఇప్పుడు ఓటిటిలు కూడా ఒకటి రెండు కాకుండా పదుల సంఖ్యలో పుట్టుకొచ్చేశాయి. ఓటిటిల వల్ల థియేట్రికల్ సినిమాలకు నష్టం జరుగుతుందా? అనే వాదనలు ఓవైపు.. ఎందుకంటే ఓటిటిల కారణంగా థియేటర్స్ కి వెళ్లే ఆడియెన్స్ సంఖ్య బాగా తగ్గిందని అంటున్నారు.
అదేం లేదు.. ఓటిటిలతో సినిమాలకు కాస్తోకూస్తో లాభాలే జరుగుతున్నాయని మరోవైపు వాదన. ఇన్ని వాదోపవాదనల మధ్య మినిమమ్ వారానికి ఇరవైకి పైగా సినిమాలు ఓటిటి రిలీజ్ అవుతుండటం గమనార్హం. థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలన్నీ రెండు మూడు వారాల్లోనే ఓటిటి బాటపడుతున్నాయి. పైగా థియేటర్స్ లో కుదరకపోతే నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. సో.. ఈ వారం చాలా సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ మొదలయ్యాయి. అంతేగాక ఈ శుక్రవారం(జనవరి 20న) ఏకంగా 23 సినిమాలు, వెబ్ సిరీస్ లు, షోలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. మరి ఓటిటి స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలేంటో చూద్దామా!