ఆంధ్రప్రదేశ్- సంక్రాంతి పండగ అయిపోయాక కొంత మంది యువకులకు జోష్ గుర్తుకు వచ్చింది. అంతే మరి కొంత మంది యువతులతో కలిసి తోటలో చిందేశారు. మద్యం మత్తులో అర్ధరాత్రి అశ్లీల నృత్యాలతో చలరేగిపోయారు. రేవ్ పార్టీని తలపించేలా సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుని, పాటలు, కేకలతో హోరెత్తించారు.
కాసేపయ్యాక స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తోటలో దాడులు చేసిన పోలీసులు ముగ్గురు యువతులు, ఏడుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కారు, ఆరు సెల్‌ఫోన్లు, ఐదు బైక్‌లు, సౌండ్ సిస్టమ్‌ను స్వాధీనం చేసుకున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా పంగిడిగూడెం పంచాయతీ సూర్యచంద్రరావుపేట, పంగిడిగూడెం, నల్లజర్ల, రాజమండ్రిలకు చెందిన ఏడుగురు యువకులు తమ బైక్ లపై పొలసానిపల్లిలోని ఓ తోటలో గానా బజానా ఏర్పాటు చేసుకున్నారు. మరో కారులో ముగ్గురు యువతులు అక్కడికి వచ్చారు. మద్యం మత్తులో ఐటెం సాంగ్స్ తో అర్ధనగ్నంగా ఉన్న యువతులతో అరుపులు, కేకలతో యువకులు చిందులేశారు.
సౌండ్ సిస్టమ్ తో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. భీమడోలు ఎస్ఐ ఏఎస్వీ భద్రరావు సిబ్బందితో ఘటన స్థలానికి వచ్చారు. మద్యం మత్తులో చిందులేస్తున్న యువతులు, యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఐతే పోలీసుల రాకను గమనించిన నిర్వాహకుడు పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.