కోడి ముందా? గుడ్డు ముందా? ఈ ప్రశ్నకు అసలైన సమాధానమే దొరకలేదు. కానీ, తాజాగా బ్రిస్టల్ యూనివర్సిటీ చేసిన పరిశోధనల్లో మాత్రం ఈ ప్రశ్నకు సమాధానం దొరికిందని తెలిపింది. ఇంతకు కోడి ముందా? గుడ్డు ముందా? అనేది తెలుసుకోవాలనుందా?
కోడి ముందా? గుడ్డు ముందా? .. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రశ్నకు ఇప్పటి వరకు అసలు సమాధానమే దొరకలేదు. అయినా సరే.. కోడి కంటే గుడ్డే ముందని కొందరంటే.. కాదు కాదు,.. కోడి లేకుండా గుడ్డు ఎక్కడి నుంచి వస్తుందని మరి కొందరు వాదిస్తూ వచ్చారు. కానీ, మొత్తానికి ఈ ప్రశ్నకు తాజాగా సమాధానం దొరికింది. ఇన్నేళ్లుగా దొరకని ఈ ప్రశ్నకు సమాధానాన్ని ఎట్టకేలకు సైంటిస్టులు తేల్చేశారు. ఇంతకి కోడి ముందా? గుడ్డు ముందా అనే ప్రశ్న సమాధానం తెలుసుకోవాలనుందా? అయితే మీరు ఈ ఆర్టికల్ చదవాల్సిందే.
కోడి ముందా? గుడ్డు ముందా? అనే ప్రశ్నకు సమాధానం ఇప్పటి వరకు దొరకలేదు. కానీ, బ్రిస్టల్ యూనివర్సిటీ తాజా అధ్యయనంలో మాత్రం ఈ ప్రశ్నకు సమాధానాన్ని రాబట్టారు శాస్త్రవేత్తలు. సరిసృపాలు, క్షీరదాలు, పక్షులు ఇప్పుడున్న రూపాన్ని సంతరించుకోక ముందు గుడ్లు పెట్టడానికి బదులుగా పిల్లలకు జన్మనిచ్చాయని సైంటిస్ట్ లు శాస్త్రీయంగా తేల్చి చెప్పారు. 51 శిలాజ జాతులు, 29 జీవ జాతులపై చేసిన పరిశోదనల్లో అసలు నిజాన్ని బయటపెట్టారు. అయితే, పిల్లలు కనేవి అనే రెండు కేటగిరీలుగా విభజించి శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. మొదట్లో తమ పునరుత్పత్తిని నీటిపైనే ఆధారపడేవని, పరిస్థితులు అనువుగా మారేంత వరకు కూడా గర్భాన్ని కడుపులోనే దాచుకునేవని శాస్త్రవేత్తలు ఆధ్యయనంలో తెలిపారు. మొత్తానికి శాస్త్రవేత్తలు గుడ్డు కన్న కోడే ముందని తేల్చి చెప్పారు.