వెండితెర అయినా.., బుల్లితెర అయినా గ్లామర్ ఫీల్డ్స్ కిందే లెక్క. ఇక్కడ అందాలను ఆరబోసే వారిదే హవా. ఈ విషయం అర్ధమైన ముద్దుగుమ్మలు ఇప్పుడు టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నారు. ఈ సక్సెస్ మంత్రాన్ని కాస్త ఆలస్యంగా గ్రహించిన వారు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో ఘాటైన అందాలను ఆరబోస్తూ హీట్ పుట్టిస్తున్నారు. స్టార్ యాంకర్ విష్ణుప్రియ ఈ కోవకే చెందుతుంది. యాంకర్ గా బుల్లితెరపై ఫోకస్ చేసిన ఈ అమ్మడు.., ఇప్పుడు వెండితెరపై వెలిగిపోవాలని కలలు కంటుంది. ఈ ప్రయత్నంలో ఇప్పటికే కొన్ని సినిమా అవకాశాలను దక్కించుకుంది కూడా. ఇక ప్రస్తుతం విష్ణుప్రియ చేతిలో కొన్ని వెబ్ సిరీస్ లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
కెరీర్ ఇలా న్యూ టర్న్ తీసుకోవడంతో తన ఫిజిక్ పై కూడా ద్రుష్టి పెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఈ నేపథ్యంలోనే చాలా కష్టపడి జీరో సైజ్ కి మారింది విష్ణు. మరి.., ఇంత పర్ఫెక్ట్ స్ట్రక్చర్ సాధించినప్పుడు దాన్ని చూపించకపోతే ఎలా అనుకుందో ఏమో? మతి పోగొట్టే ఓ హాట్ వీడియోని తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ యాంకరమ్మ.
ఇందులో విష్ణుప్రియ ఇంగ్లీష్ పాటకి మైమరచిపోయి డ్యాన్స్ చేస్తూ రెచ్చిపోయింది. టూ పీస్ బికినీలా అనిపించే డ్రెస్ లో నాభి అందాలను ఆరబోస్తూ, నడుముని వయ్యారంగా తిప్పుతూ విష్ణుప్రియ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇక ఇదే వీడియోలో హైలెట్ గా నిలిచిన ఆమె తొడ అందాలైతే కుర్రకారుకి ఊపిరి ఆడకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.., విష్ణుప్రియ అవకాశాల కోసం ఇంతలా రెచ్చిపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.