ఓ ప్రభుత్వ అధికారి భార్య అల్లిన చోరీ కథ.. పోలీసులను పరుగులు పెట్టించింది. జరగని దొంగతనాన్ని జరిగినట్లు ఓ కట్టుకథ అల్లి పోలీసులను టెన్షన్ పెట్టించింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ వేలి ముద్రలు సేకరించారు. సీసీ పుటేజీలను పరిశీలించారు. నేరం జరిగిన ఆనవాళ్లు కనిపించకపోవడంతో ఆమెను పదే పదే ప్రశ్నించగా అసలు విషయం తెలిసింది.
పోలీసులు కథనం ప్రకారం.. గుంటూరు డ్వాక్రా కార్యాలయంలో పనిచేసే అధికారి.. కుంచనపల్లిలో ఓ అపార్ట్ మెంట్ లో తన భార్యతో నివాసం ఉంటున్నాడు. ఆయన పనిపై ఉదయం బయటకి వెళ్లగా.. ఆయన భార్య ఇంట్లో పనిచేసుకుంటోంది. ఇంతలో కొందరు దొంగలు వచ్చి ఇంట్లోకి ప్రవేశించి.. ఆమె ముఖం పై మత్తు మందు చల్లారు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లాక బెడ్రూమ్ లోకి ప్రవేశించి అక్కడి సొమ్ముకోసం వస్తువులను చెల్లాచెదురుగా పడేశారు. గదిలోని బీరువా తెరచి చూడగా 30 తులాల బంగారం, రూ.3 వేలు దోచుకెళ్లినట్లు తెలుస్తుంది.కాసేపటికి తేరుకున్న ఆమె ఇంటికి వచ్చిన భర్తకు అసలు విషయం చెప్పింది. అనంతరం ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్లూస్ టీమ్ వచ్చి అక్కడి వేలిముద్రలు సేకరించింది. క్లూస్ టీమ్ సీసీ పుటేజీలను కూడా పరిశీలించింది. చివరికి ఆమె వేలిముద్రలు సేకరించిన వేలిముద్రులకు మ్యాచ్ అవ్వడంతో.. దొంగ ఆమెనే అని తెలిసి పోలీసులు అవాక్కైయారు. ప్రభుత్వ ఉద్యోగి భార్య చెప్పిందంతా కట్టుకథేనని చివరికి తేలింది. ఆమెకు మతిస్థితిమితం సరిగ్గా లేకపోవడంతో ఇలా వ్యవహరించినట్లు డీఎస్పీ రాంబాబు తెలిపారు. మరి ఇంత అతితెలివి ప్రదర్శించిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి.