నేటికాలంలో చాలామందిలో ఓర్పు నశిస్తోంది. ప్రతి చిన్న విషయానికి ఆవేశాలకు పోయి..దారుణాలకు పాల్పడుతున్నారు. కొంతమంది క్షణికావేశంతో ఎంత దారుణానికి ఒడిగడుతున్నారంటే సొంత వారిపై కూడా విచక్షణారహితంగా దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా కోడి కూర విషయంలో ఓ అన్న గొడ్డలితో చెల్లిని దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కూనవరం మండలం కన్నాపురానికి చెందిన కొవ్వాసి నంద కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని చెల్లెలు సోమమ్మ(20) తెలంగాణలోని కరకగూడెం మండలం మాదన్నగూడెంలో ఉంటుంది. అన్నను చూసేందు సోమమ్మ వారం క్రిందట కన్నాపురం వచ్చింది. ఈక్రమంలో రెండు రోజుల్లో వస్తానంటూ నంద భార్య పుట్టింటికి వెళ్లింది. అయితే నంద గురువారం రాత్రి పూటుగా మద్యం తాగి..కోడి మాసం తీసుకుని ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఉన్న చెల్లి సోమమ్మను కోడి కూర వండమన్నాడు. తనకు నీరసంగా ఉందని ఇప్పుడు చేయలేనని తెలిపింది సోమమ్మ. అయినా వినకుండా నంద సోమమ్మతో గొడవకు దిగి.. తాను ఇంటికొచ్చేసరికి కూర వండి ఉండాలని చెప్పి బయటకి వెళ్లిపోయాడు.
శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చి కోడి కూర వడ్డించమని కోరగా.. ఆమె వండలేదని చెప్పడంతో క్షణికావేశంలో దాడికి యత్నించాడు. ఆమె అరుస్తూ బయటకి పరిగెత్తుండగా వెంబడించిన నంద..గొడ్డలితో విచక్షణ రహితంగా నరికాడు. సోమమ్మ గట్టిగా అరవడంతో చుట్టుపక్కలవారు అక్కడి చేరుకుని.. రక్తపు మడుగులో కొన ఊపిరితో ఉన్న సోమమ్మను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసే లోపే ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.