బాలీవుడ్ మోస్ట్ హస్కీ బ్యూటీ అనగానే గుర్తుకు వచ్చే పేరు విద్యా బాలన్. ఎంత మంది హీరోయిన్లు ఉన్నా క్రేజీ లుక్స్, మత్తేక్కించే నటన చేయాలంటే అది ఆమెకే సాటి. ఈ విషయం డర్టీ పిక్చర్ తో రుజువు చేసిందీ కూడా. అయితే ఇప్పుడు మరో సారి సెగలు పుట్టించే లుక్స్ లో కనిపించి మెస్మరైజ్ చేసింది.
బాలీవుడ్ బ్యూటీస్ లిస్ట్ గురించి చెప్పండీ అంటే చాంతాడంత ఉంటుంది. అయితే వారిలో బోల్డ్ లుక్స్ లో కుర్రకారును ఫిదా చేసిన వారిలో ముందు వరుసలో ఉంటారు విద్యా బాలన్. ఆదిలో ఐరెన్ లెగ్ అని ముద్ర పడిన ఈ అమ్మడు.. తర్వాత గోల్డెన్ స్టార్ గా ఎదిగింది. సీరియల్స్ నుండి సినిమా రంగానికి ఎగిసిపడింది. హోమ్లీ సినిమాల నుండి బోల్డ్ సినిమాలకు మారింది. ఒకే ఒక్క సినిమా ఆమె ఫేట్‌ను మార్చేసింది. అదే డర్టీ పిక్చర్. దేశ వ్యాప్తంగా ఆమె పేరు చర్చించుకునేలా ఆమె చేసింది. ఆమె సినిమాలతోనే కాదూ తన ఫన్నీ, ఇతర వీడియోలతో ఇన్‌స్టాగ్రామ్ లోనూ సందడి చేస్తూ ఉంటోంది. ఎప్పుడు శారీస్, చుడీదార్స్ లో కనిపించే ఈ అమ్మడు. ఇప్పుడు బోల్డ్ లుక్ లో దర్శనమిచ్చింది.
ఇటీవల విద్యాబాలన్ ఓ ఫోటో షూట్‌లో పాల్గొంది. ఈ ఫోటోలో ఆమె హాట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తోంది. ఈ ఫోటోలు నెట్టింట్లో ప్రముఖ ఫోటోగ్రాఫర్ షేర్ చేయగా.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. అందులో ఆమె స్కీన్ షో చేస్తూ.. ఓ న్యూస్ పేపర్‌ను తన శరీరానికి అడ్డు పెట్టుకుంది. ప్రముఖ ఫోటో గ్రాఫర్ డాబూ రత్నానీ ఆమెకు ఫోటోలు తీశారు. ఆయనే వీటిని తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసుకున్నారు. ఓ చేతిలో తన చేతికి పేపర్ అడ్డు పెట్టుకుని, మరో చేతితో కప్పుతో విద్యా బాలన్ కనిపించారు. కళ్లజోడు పెట్టుకుని వయ్యారంగా కూర్చుని ఫోటోలకు ఫోజులిచ్చారు. 44 ఏళ్ల వయసులో కూడా ఏ మాత్రం అందం చెక్కు చెదరలేదు. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు విద్యా బాలన్ యేనా అని ఒకటి రెండు సార్లు చూస్తున్నారు. హాట్ న్యూస్ అని, బోల్డ్ విత్ బ్యూటీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కొంత మంది ఫైర్ సింబల్స్ ఇస్తున్నారు.
విద్యాబాలన్ తమిళ బ్రాహ్మిణుల కుటుంబంలో 1979లో ముంబయిలో జన్మించింది. ఆమె హిందీతో పాటు తమిళ, కొంచెం మలయాళం కూడా మాట్లాడగలరు. తొలుత ఏక్తాకపూర్ సీరియల్ హమ్ పంచ్‌లో నటించింది. హీరోయిన్ కావాలనుకుంటున్నానని ఇంట్లో చెప్పడంతో చదువుపై దృష్టి పెట్టమని కుటుంబ సభ్యులు చెప్పడంతో సోషియాలజీలో ముంబయి యూనివర్శిటీ నుండి మాస్టర్ డిగ్రీ పొందింది. ఆ తర్వాత మలయాళ సినిమాల వైపు వచ్చాడు. పలు సినిమాలకు సైన్ చేయగా అవి మధ్యలోనే ఆగిపోయాయి. కొన్ని సినిమాలు చేజారిపోయాయి. దీంతో ఐరెన్ లెగ్ అని ముద్ర పడింది. ఓ బెంగాలీ సినిమాలో నటించినా పేరు రాలేదు. అయినప్పటికీ వెనుకడుగు వేయలేదు. ఆ తర్వాత హిందీ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.
పరిణీత అనే సినిమాలో హోమ్లీ క్యారెక్టర్ చేసింది. ఆ సినిమా హిట్ కావడంతో ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత లగేరహో మున్నాభాయి, గురు, పలు తమిళ్ , మలయాళ సినిమాల్లో కూడా మెరిసింది. ఎన్నిచేసినా.. తెలుగు హీరోయిన్ సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా చేసిన డర్టీ పిక్చర్ తో ఆమెకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమాతో ఆమె పలికిన హవ భావాలకు ఫిదా కాని వారు ఉండరు. దీంతోనే ఆమె స్టార్ డమ్ ను సొంతం చేసుకుంది. 2012లో నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్ ను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆమె నటించిన సినిమాలో మీకు ఏ చిత్రం అంటే ఇష్టమో కామెంట్ల రూపంలో తెలియజేయండి.