గత కొంత కాలంగా విద్యార్థులపై టీచర్లు వేధింపులకు పాల్పడే సంఘటనలను తరచుగా చూస్తూనే ఉన్నాం. కొన్ని రోజుల క్రితం బిహార్‌లో ఓ చిన్నారిని ట్యూషన్ టీచర్ విచాక్షణారహితంగా చితకబాదిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం.. సదరు టీచర్‌ను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో తాజాగా ఇదే కోవకు చెందిన మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. టీచర్ల వేధింపులు తాళలేక ఓ స్టూడెంట్ సూసైడ్ చేసుకుంది. దీంతో తల్లిదండ్రులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ కు వచ్చి నిరసన తెలిపారు. అయితే ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. స్కూల్ ఆవరణలో పార్క్ చేసి ఉన్న బస్సులను తగులబెట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు రాష్ట్రం కళ్లకురిచి సమీపంలోని చిన్న సేలం వద్ద ఉన్న ప్రైవేట్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఒకరు నాలుగు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది. అయితే తనను ఇద్దరు ఉపాధ్యాయులు చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ సూసైడ్ నోట్ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలి మృతదేహాన్ని జులై 13వ తేదీన స్కూల్ వాచ్‌మెన్ మైదానంలో గుర్తించాడు. వెంటనే స్కూల్ అడ్మినిస్ట్రేషన్‌ని అప్రమత్తం చేసి పోలీసులకు సమాచారం అందించాడు. విషయం తెలిసిన వెంటనే పాఠశాల యాజమాన్యం.. బాధితురాలిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించారు.
ఈ క్రమంలో టీచర్ల వేధింపుల వల్లే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందనే ఆరోపణలు వినిపస్తున్నాయి. విద్యార్థిని హాస్టల్ బిల్డింగ్ మూడో ఫ్లోర్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోస్ట్ మార్టం రిపోర్టులో కూడా విద్యార్థిని శరీరంపై గాయలున్నట్లు వెల్లడయ్యింది. అయితే వేధింపుల వల్లే స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుందనే విషయాన్ని ఉపాధ్యాయులు ఖండించారు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు గత బుధవారం కళ్లకురిచ్చి-సేలం రహదారిని దిగ్బంధించి, పాఠశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Protest March on Tamil Nadu Student Death#Srimathi #JusticeForSrimathi #ஸ்ரீமதி #ஸ்ரீமதிக்கு_நீதி_வேண்டும் pic.twitter.com/jbJ0A7aZlf
— Chaudhary Parvez (@ChaudharyParvez) July 17, 2022
అలాగే ఆదివారం నిరసనకారులు రెసిడెన్షియల్ పాఠశాల ఆవరణకు చేరుకున్నారు. టీచర్లపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. ఆవరణలో ఉన్న బస్సులను, ఇతర ఆస్తులను తగులబెట్టారు. పలు వస్తువులను ధ్వంసం చేశారు. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. హింసకు పాల్పడిన దుండగులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని స్థానిక పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ క్రమంలో ప్రస్తుతం కళ్లకురిచి నప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న సీఎం స్టాలిన్.. ఆందోళనకారులు శాంతియుతంగా ఉండాలని.. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా మృతురాలి తల్లి మాట్లాడుతూ.. బాలిక గాయపడిందని పాఠశాల యాజమాన్యం మొదట తనకు సమాచారం అందించిందని తెలిపారు. తరువాత చనిపోయిందని చెప్పారని అన్నారు. బాలిక రక్తస్రావం, గాయాల కారణంగా షాక్‌కు గురై మృతి చెందినట్లు పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది. గాయాలకు మూలం ఏమిటని ఆరా తీస్తున్న తల్లిదండ్రులు మరోసారి పోస్టుమార్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#WATCH Tamil Nadu | Violence broke out in Kallakurichi with protesters entering a school, setting buses ablaze, vandalizing school property as they sought justice over the death of a Class 12 girl pic.twitter.com/gntDjuC2Zx
— ANI (@ANI) July 17, 2022