బుల్లితెర డెస్క్- సినిమా, టీవీ ఇండస్ట్రీలో కొంత మంది ఎన్నో ఎళ్లుగా నటిస్తున్నా మంచి పేరు, బ్రేక రాకపోవచ్చు. కానీ కొందరికి మాత్రం అదేంటో గాని ఒక్క క్యారెక్టర్ తో మంచి గుర్తింపు వస్తుంటుంది. అది చిన్న క్యారెక్టర్ అయినా, పెద్ద క్యారెక్టర్ అయినా సరే. గుర్తింపు వచ్చాక ఇక అవకాశాలు క్యూ కడతాయాని వేరే చెప్పక్కర్లేదు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో సూపర్ ఉమెన్ గా నటించిన లిరీష విషయంలో కూడా ఇదే జరిగింది.
కేవలం వకీల్ సాబ్ సినిమాతో సూపర్ ఉమెన్‌గా ఫుల్ పాపులర్ అయ్యింది లిరీష. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా చూసిన అందరికి సూపర్ ఉమెన్ సీన్ అలా మదిలో నిలిచిపోతుంది. సూపర్ ఉమెన్ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగులు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. దాంతో లిరీష ను అందరు గుర్తుపెట్టుకున్నారు. అంతకు ముందు చాలా సినిమాలు, సీరియల్స్ లో నటించినా రాని గుర్తింపు కేవలం సూపర్ ఉమెన్ క్యారెక్టర్ తో లిరిషకు గుర్తింపు వచ్చింది.
ఇక ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ లో పాల్గొని హంగామా చేసింది సూపర్ ఉమెన్ లిరీష. ఎక్కడికైనా 15 నిమిషాల్లో వెళ్లిపోయే సూపర్ ఉమెన్ రా నేను.. అంటూ జబర్దస్త్ షోలో పోలీస్ డ్రెస్‌లో ఎంట్రీ ఇచ్చింది ఈ సూపర్ ఉమెన్. రాకెట్ రాఘవ స్కిట్‌లో లిరీష సందడి చేసింది. కత్తిలా ఉందంటూ లిరీషపై కమెడియన్ పంచులు వేయగా, దానికి సూపర్ ఉమెన్ ఇచ్చిన రియాక్షన్ కడుపుబ్బా నవ్విస్తోంది. జులై 22న ప్రసారం కాబోతున్న జబర్దస్త్ ప్రోమో రిలీజ్ చేయగా ఇప్పుడిది బాగా వైరల్ అవుతోంది.