ఫిల్మ్ డెస్క్- దేశంలో కరోనా మహమ్మారి విజృంబిస్తోంది. పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో దేశంలో చాలా రాష్ట్రాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో చాలామంది వలస కార్మికులు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు. లక్షలాది మంది కార్మికులు తిండిలేక సతమతమవుతున్నారు. ఇటువంటి క్లిష్ట సమయంలో బాలీవుడ్ నటి సన్నీ లియోన్ పెద్ద మనసు చాటుకున్నారు. వలస కార్మికుల కోసం నటి సన్నీ లియోన్, పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్.. పెటా ఇండియాతో కలిసి ఉదయ్ ఫౌండేషన్ ద్వారా పదివేల మందికి ఆహారం అందించేందుకు ముందుకు వచ్చింది.
దిల్లీలోని వలస కార్మికులకు ఈ శాకాహార భోజనాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది సన్నీ లియోన్. కరోనా సమయంలో మనం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం.. ఇలాంటి పరిస్థితుల్లో కరుణ, సంఘీభావంతో ముందుకు నడవాలి.. పెటా ఇండియాతో పనిచేసేందుకు ముందుకు వస్తున్నాం.. వారితో కలిసి మరోసారి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది.. ఈసారి వేలాది వలస కార్మికులకు ప్రొటీన్‌తో కూడిన ఆహారం అవసరం.. అని సన్నీ లియోన్ చెప్పింది. సన్నీ లియోన్ 2016 లో పెటా ఇండియా పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికైందన్న సంగతి తెలిసిందే.
ఇక సన్నీ జిస్మ్ 2 సినిమాతో బాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యింది. ప్రస్తుతం సన్నీ లియోన్ మలయాళంలో షెరో, రంగీలా సినిమాల్లో నటిస్తోంది. తెలుగు, హిందీలో తెరకెక్కుతున్న హెలెన్, కోకా కోలా మూవీస్ లో కూడా సన్నీ లియోన్ యాక్ట్ చేస్తోంది. మొత్తానికి సన్నీ లియోన్ కార్మికుల కష్టాలకు చలించి ఆహారాన్ని అందంచడంతో ఆమెపై ప్రసంశల జల్లు కురుస్తోంది.