ఫిల్మ్ డెస్క్- దేశంలో కరోనా మహమ్మారి విజృంబిస్తోంది. పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో దేశంలో చాలా రాష్ట్రాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో చాలామంది వలస కార్మికులు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు. లక్షలాది మంది కార్మికులు తిండిలేక సతమతమవుతున్నారు. ఇటువంటి క్లిష్ట సమయంలో బాలీవుడ్ నటి సన్నీ లియోన్ పెద్ద మనసు చాటుకున్నారు. వలస కార్మికుల కోసం నటి సన్నీ లియోన్, పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్.. పెటా ఇండియాతో కలిసి ఉదయ్ ఫౌండేషన్ […]