నటీనటులు ఎవరైనా సరే షూటింగ్ లేదా ఇతర విషయాల్లో చాలా జాగ్రత్తగానే ఉంటారు. కానీ కొన్నిసార్లు గాయపడుతుంటారు. ఇప్పుడు నటి సన్నీ లియోనీకి కూడా అలాంటి గాయమైనట్లే తెలుస్తోంది. స్వయంగా ఆమెనే వీడియో పోస్ట్ చేయడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇక హిందీతో పాటు సౌత్ సినిమాల్లో నటిస్తున్న సన్నీ.. తెలుగులో చివరగా మంచు విష్ణు ‘జిన్నా’ వన్ ఆఫ్ ది హీరోయిన్ గా చేసింది. అలాంటి సన్నీ లియోనీ ఇప్పుడు గాయపడటం, ఆ వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేయడంతో అభిమానులు ఒక్కసారిగా కంగారు పడ్డారు.
ఇక విషయానికొస్తే.. పోర్న్ స్టార్ గా ఫేమస్ అయిన సన్నీ లియోనీ వాటిని పూర్తిగా వదిలేసి నటిగా మారింది. బాలీవుడ్ లో తొలుత సినిమాలు చేసిన ఈమె తెలుగులోనూ ‘కరెంటు తీగ’, ‘జిన్నా’ తదితర చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం భర్త, తన ముగ్గురు పిల్లలతో కలిసి ముంబయిలో ఉంటోంది. అయితే సోషల్ మీడియాలోనూ బిజీగా ఉండే సన్నీ.. హాట్ హాట్ ఫొటోస్ తోపాటు పలు ఇంట్రెస్టింగ్ వీడియోలను కూడా అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా అలాంటి ఓ వీడియో నెటిజన్స్ తో పంచుకుంది.
ఇక ఈ వీడియోలో మాట్లాడిన సన్నీ లియోనీ.. పెదవి నుంచి చాలా రక్తం పోతున్నా సరే తన భర్త ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అలానే తన భర్త ఈ మధ్య బాగా చూసుకోవడం లేదని చెప్పింది. ఫస్ట్ కాస్త సీరియస్ గా చెప్పింది కానీ ఇదంతా కూడా ఫన్ కోసమేనని ఆ తర్వాత చెప్పేసింది. తన పెదవికి గాయమవలేదని, ఇన్ స్టా రీల్స్ లో ఫిల్టర్స్ అది అని క్లారిటీ ఇచ్చేసింది. ఇంతకు ముందు చిన్న గాయమైతే అది ఎప్పుడో తగ్గిపోయిందని చెప్పుకొచ్చింది. మరి హాట్ బ్యూటీ సన్నీ లియోనీ పోస్ట్ చేసిన ప్రాంక్ వీడియో చూసి మీరేం అనుకున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.