బుల్లితెరలో ప్రసారమౌతున్న షోల్లో ఒకటి సిక్త్ సెన్స్, ప్రస్తుతం సీజన్ సిక్స్ నడుస్తుంది. ఓంకార్ యాంకరింగ్ తో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. తన వన్ సెకన్ మేనరిజమ్ తో ఆట ఆడేందుకు వచ్చిన వారికి చెమటలు పట్టిస్తున్నారు ఓంకార్. ఇప్పుడు మరో రెండు టీములతో రాబోతున్నారు మన ఓంకార్ అన్నయ్య. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా, కాస్త ఫన్, కాస్త శాడ్ కనిపించింది.
బుల్లితెరలో ప్రసారమౌతున్న షోల్లో ఒకటి సిక్త్ సెన్స్, ప్రస్తుతం సీజన్ ఫైవ్ నడుస్తుంది. ఓంకార్ యాంకరింగ్‌తో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. తన వన్ సెకన్ మేనరిజమ్‌తో ఆట ఆడేందుకు వచ్చిన వారికి చెమటలు పట్టిస్తున్నారు ఓంకార్. ఈ సీజన్‌లో తమ సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు మూవీ టీమ్స్ వస్తున్నాయి. అందులో భాగంగా విరూపాక్ష టీం వచ్చి సందడి చేసింది. సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్, రవికృష్ణ, సోనియా సింగ్ వచ్చారు. ఆ తర్వాత మళ్లీ పెళ్లి నుండి నరేష్, పవిత్రలు వచ్చి రచ్చ చేశారు. డెడ్ పిక్సల్, సేవ్ ద టైగర్ వంటి వెబ్ సిరీస్ నటులు ఈ షోకు వచ్చి ఆడి పాడారు. అలాగే బీబీ జోడీలతో పాటు సీరియల్స్, వార్తా చానల్స్ యాంకర్స్ వచ్చి సందడి చేశారు. ఇప్పుడు మరో రెండు టీములతో రాబోతున్నారు మన ఓంకార్ అన్నయ్య. అందులో ఒకటి జేడీ చక్రవర్తి, ఈ రెబ్బ నటించిన వెబ్ సిరీస్, మరోటి హిడింబ టీమ్. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా, కాస్త ఫన్, కాస్త శాడ్ కనిపించింది.
మొదట జేడీ చక్రవర్తి టీమ్ వచ్చారు. పవన్ సాధినేని దర్శకత్వంలో రాబోతున్న క్రైమ్ థిల్లర్ వెబ్ సిరీస్. ఇందులో జెడి చక్రవర్తి, ఈషా రెబ్బ నటిస్తున్నారు. వీరితో పాటు కమల్ కామరాజు, జబర్థస్థ్ కమెడియన్ వచ్చారు. ఈ సందర్భంగా జేడీ చక్రవర్తి ఫన్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నించాడు. ఆ షోలో ఉండే ఇద్దరు ముద్దుగుమ్మల కాళ్లు చూసి, అవి ఒరిజనలేనా అని అడిగాడు చక్రవర్తి. అంత తెల్లగా ఉన్నాయేంటీ.. ఓ సారి ముట్టుకోవచ్చా.. అంటే ఆమె ఇది ఒరిజనల్ అనగానే.. ‘నన్ను ఓంకార్ మోసం చేస్తున్నాడేమో‘ అంటూ ఆ అమ్మాయిల కాళ్లను పట్టుకున్నాడు జేడీ చక్రవర్తి. ‘మీ సినిమా కెరీర్ లో ఎప్పుడన్నా, ఏ హీరోయిన్ అయినా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశారా‘? అని ఓంకార్ అడగ్గా..‘ మా నాన్న మీద ఒట్టు అందరినీ ట్రై చేశా‘ అని చెప్పాడు జేడీ. ఆ తర్వాత అమ్మ మీద కూడా ఒట్టు వేశాడు. గురువు రామ్ గోపాల్ వర్మ నిజమైన శిష్యుడు అనిపించాడు. అమ్మాయిల పట్ల ఆర్జీవీ ఎలా ఉంటాడో.. అలాగే కనిపించాడు జేడీ.
ఆ తర్వాత హిడీంబీ సినిమా టీం కూడా వచ్చారు. ఇందులో నటించిన ఓంకార్ బ్రదర్..అశ్విన్, హీరోయిన్ నందితా శ్వేత, విద్యుల్లేఖా రామన్ వచ్చారు. తొలిసారిగా తన తమ్ముడితో కలిసి సిక్త్ సెన్స్ ఆడుతున్నానని చెప్పారు ఓంకార్. మీరు ఎన్నో స్ట్రగుల్స్ పడి ఉంటారు కదా..ఏ స్ట్రగుల్ మీకొక లెసన్ నెర్పిందీ అని నందితాను ఓంకార్ ప్రశ్నించగా.. ఎమోషనల్ అయిపోయింది నందితా. ‘మానాన్న ఆసుపత్రిలో ఉన్నాను. నేను షూటింగ్ వెళ్లాలి. ఐదు ఆరు రోజులు ఉండను .. మీరు చూసుకుని తినండి అని చెప్పాను. అయిన నా చేతి పట్టుకుని, వెళ్లిపోతున్నావా.. నువ్వు లేకపోతే నాకు కాళ్లు, చేతులు ఆడవు అన్నారు’ అంటూ ఏడ్చేసింది. అదే తనకు, నాన్నకు జరిగిన చివరి మాటలు అని కన్నీటి పర్యంతమైంది. అలాగే తన తమ్ముడు అశ్విన్ కు కూడా ఓ ప్రశ్న వేశాడు. ‘నీ లైఫ్ లో ఏదైనా బాధను నాకు చెప్పకుండా నా దగ్గర దాచావా‘ అని ప్రశ్నించగా.. దానికి అశ్విన్ బాగా బాధపడ్డాడు. ఆ సమయంలో ‘అన్న అయినా, నాన్న అయినా అన్ని నేను నీకు, నాకు చెప్పడానికేంట్రా’ అని అడగ్గా.. అశ్విన్ కన్నీరు పెట్టుకున్నారు. అన్నీ ఇచ్చావని, అడగాలంటే ఏదోలా ఉందని ఏడ్చేశాడు. ఈ ప్రోమో ఆద్యంతం నవ్వులు, కన్నీళ్లు కార్చేలా చేసింది.