సెరీనా విలియమ్స్ ఈ పేరు చెబితే టెన్నిస్ క్రీడాభిమానులు మాత్రమే కాదు. ప్రపంచంలో అన్ని క్రీడలు అభిమానించే వారు మెచ్చుకుంటారు. మైదానాంలోకి సెరీనా దిగిందంటే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. ఆమె ఆట తీరు బలంగా వేగంగా ఉంటుంది. ఏడుసార్లు వింబుల్డన్ టైటిల్ ని గెల్చుకుంది. వింబుల్డన్ టైటిల్ ను గెలవాలన్న ఏకైక లక్ష్యంతో, తన చివరి గ్రాండ్ స్లామ్ ఆడేందుకు బరిలోకి దిగిన సెరీనా విలియమ్స్ తొలి రౌండ్ నుంచి వైదొలగింది. బెలారస్ కు చెందిన అలెక్సాండ్రా సస్నోవిచ్ తో 39 సంవత్సరాల వయసులోనూ సత్తా చాటుతూ తొలి సెట్ లో 3-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఓ షాట్ ఆడే క్రమంలో కిందపడగా, ఎడమ మడమకు గాయమైంది. డాక్టర్లు పరిశీలించిన అనంతరం ఆటను కొనసాగించిన ఆమె, మునుపటి స్థాయిలో రాణించలేక ఒక సెట్ ను కోల్పోయింది. ఇక ఆడలేనంటూ సెంటర్ కోర్టులో కన్నీటి పర్యంతమైంది. ఏడుస్తూనే మైదానాన్ని వీడింది.
వింబుల్డన్ తొలి రౌండ్ లోనే సెరీనా నిష్క్రమించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2017లో ఆస్ట్రేలియన్ ఓపెన్ లో విజయం సాధించిన తరువాత, ఆమె మరో గ్రాండ్ స్లామ్ ను గెలవలేదన్న సంగతి తెలిసిందే. ఆపై జరిగిన మరో మ్యాచ్ లో మాజీ నంబర్ వన్, స్విస్ స్టార్ రోజర్ ఫెదరర్, గట్టిపోటీని ఎదుర్కొని మ్యాచ్ లో విజయం సాధించాడు. ఫ్రాన్స్ కు చెందిన అడ్రియన్ మనారినోతో తలపడిన ఆయన తొలి సెట్ ను నెగ్గి, ఆపై రెండు, మూడు సెట్లలో ఓడిపోయారు.
కీలకమైన నాలుగో సెట్ జరుగుతున్న వేళ, మనారినో కోర్టులో కిందపడి, ఇక ఆడలేనంటూ వెళ్లిపోవడంతో ఫెదరర్ గెలిచినట్లయింది. ఈ మ్యాచ్ దాదాపు 2 గంటల 45 నిమిషాలు సాగింది.
We’re heartbroken for you, Serena.
Our seven-time singles champion is forced to retire from The Championships 2021 through injury#Wimbledon pic.twitter.com/vpcW1UN78s
— Wimbledon (@Wimbledon) June 29, 2021