సెలబ్రిటీలు టాటూలు వేయించుకోవడం అనేది మామూలే. దీపికా పదుకొనె మెడ మీద ఒక టాటూ వేయించుకుంది. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ టాటూ సీక్రెట్ ఏంటా అని నెటిజన్స్ సెర్చింగ్ చేస్తున్నారు.
టాటూ అంటే జనానికి ఎంత పిచ్చో పత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తమకు ఇష్టమైన వ్యక్తుల పేర్లు, నచ్చిన సింబల్స్ ని శరీరంలో పలు చోట్ల టాటూ వేయించుకుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు అయితే టాటూ అంటే పిచ్చెక్కిపోతారు. తాజాగా దీపికా పదుకొనె మెడ మీద ఉన్న టాటూ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీపికా పదుకొనె బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. హాలీవుడ్ లో నటించి తన సత్తా చాటింది. ప్రస్తుతం ప్రభాస్ సరసన ప్రాజెక్ట్ కె సినిమాలో నటిస్తోంది. ఇటీవలే లాస్ ఏంజిల్స్ లో జరిగిన 95వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో ఒకానొక ప్రెజెంటర్ గా కూడా వ్యవహరించింది. అయితే ఈ వేడుకల్లో దీపికా పదుకొనె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
పొడవాటి నల్ల గౌను వేసుకుని కిక్కెక్కించింది. తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే నెటిజన్స్ దీపికా పదుకునే మెడ మీద ఉన్న టాటూ సీక్రెట్ ఏంటని సెర్చింగ్ చేస్తున్నారు. దీపికా మెడ మీద 82°E అనే టాటూ ఉంది. 82°E అనేది ఆమె కొత్తగా మొదలు పెట్టిన స్కిన్ కేర్ బ్రాండ్. తన బ్రాండ్ పేరునే తన మెడ మీద టాటూగా వేయించుకుంది. చాలా మంది స్టార్లు ఇప్పటికే సినిమాలతో పాటు పలు బిజినెస్ లలోకి అడుగుపెట్టారు. హీరోయిన్లు బొటిక్ లు, ఆభరణాల బిజినెస్ లు వంటివి చేస్తుంటారు.
ఈ కోవలోనే దీపికా పదుకొనె కూడా బిజినెస్ రంగంలో అడుగుపెట్టింది. 82°E పేరుతో స్కిన్ కేర్ ఉత్పత్తులు బయట మార్కెట్లో వస్తున్నాయి. తన స్కిన్ కేర్ బ్రాండ్ పేరునే తన మెడ మీద టాటూగా వేయించుకుంది. తన బ్రాండ్ ని తనే ఇలా కొత్తగా ప్రమోట్ చేసుకుంటుంది. తన అందమైన మెడను చూసినప్పుడు జనాలకు తన బ్రాండ్ గుర్తుకు రావాలని కాబోలు ఇలా టాటూ వేయించుకుంది. మరి శంఖం లాంటి మెడపై దీపికా టాటూ వేయించుకోవడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.