దర్శక ధీరుడు రాజమౌళి ఏదీ ఒక పట్టానా ఓకే చెప్పరని తను అనుకున్న విధంగా అవుట్‌పుట్ రాకుంటే అస్సలు కాంప్రమైజ్ కారనే బలమైన టాక్ ఇండస్ట్రీలో ఉంది. ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకంగా రుపొందుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్ విషయంలో కూడా రాజమౌళి తన పథం మార్చుకోలేదని టాక్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మన్నెందొర అల్లూరి సీతారామరాజుగా, యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ పూర్తి చేసుకుందని, వచ్చే ఏడాది జనవరిలో సినిమా విడుదల అవుతుందని చిత్ర యూనిట్ తెలిపింది.
కాగా ఎన్టీఆర్, బ్రిటీష్ బ్యూటీ ఒలివియా మోరిస్ మధ్య ప్రేమకథ ఉంటుంది. ఆ పార్ట్ రాజమౌళికి నచ్చలేదు. దాంతో ఆ పార్ట్‌ను రీషూట్ చేస్తున్నాడని, అందుకనే వచ్చే ఏడాది జనవరి అనుకున్న ఈ సినిమా సమ్మర్‌కు వెళ్లిందని టాక్ వినిపిస్తోంది. మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ వార్తలపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌లకు సంబంధించిన ఫిక్షనల్ పీరియాడిక్ డ్రామానే ‘ఆర్ఆర్ఆర్’. భారీ బడ్జెట్‌తో దానయ్య నిర్మిస్తోన్న ఈ పాన్ ఇండియా మూవీలో అజయ్ దేవగణ్, ఆలియా భట్ వంటి బాలీవుడ్ స్టార్స్, రే స్టీవెన్ సన్, ఓలివియా మోరిస్, అలిసన్ డూడి వంటి హాలీవుడ్ తారలు, కోలీవుడ్ నుంచి సముద్ర ఖని, శ్రియా శరన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాపై ఉన్న భారీ అంచనాలను అందుకునేలా రాజమౌళి సినిమాను రూపొందిస్తున్నాడు. మరోవైపు సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
