ఫిల్మ్ డెస్క్- రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు సినిమాల్లో కంటే కూడా సోషల్ మీడియాలోనే ఎక్కువ యాక్డీవా గా ఉన్నారు. ఇక ఆయన వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అని వేరే చెప్పక్కర్లేదు. ఆర్జీవీ ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తారో, ఎలాంటి వివాదాన్ని రేపుతారో ఎవ్వరు ఊహించలేరు. లోకల్ నుంచి నుంచి ప్రపంచం వరకు ప్రతీ విషయాన్ని టచ్ చేసి కాంట్రవర్సీకి కేంద్ర బిందువు అవుతారు వర్మ. ఇక అమ్మాయిలు, శృంగారం అనే సబ్జెక్ట్ మీద మాట్లాడటం అంటే రాముకు ఎంత ఇష్టమో మరి. తాజాగా వర్మ అరియానాలు పెట్టిన బోల్డ్ ముచ్చట్లు హాట్ టాపిక్ అయ్యాయి. సెక్స్ గురించి, బాడీ పార్ట్‌ల గురించి ఇద్దరూ బాహాటంగా మాట్లాడుకున్న తీరుకు అంతా షాక్ కు గురయ్యారు.
రోటీన్ ఇంటర్వూల్లా కాకుండా బోల్డ్ అంశాలను మేళవించి యంగ్ యాంకర్ అరియానాతో ఇంటర్వ్యూ చేశారు రాంగోపాల్ వర్మ. కెమెరా యాంగిల్స్ సినిమాకు మించి ఉపయోగిస్తూ జిమ్ లో అరియానా అందాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు ఆర్జీవీ. ఈ వీడియో విడుదలయ్యాక వర్మపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. కూతురు వయసున్న యంగ్ యాంకర్‌తో అలాంటి ఇంటర్వూ ఏంటని నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇలాంటి విమర్శలను పెద్దగా లెక్కచేయని ఆర్జీవీ.. వారందరికి ధిటుగా సమాధానం చెప్పారు. ఓ వీడియో ద్వారా జస్ట్ చిల్ అంటూ తనపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. నాతో అరియానా గ్లోరి చేసిన ఇంటర్వ్యూ ఫుల్ సక్సెస్ అయిందన్న రాము.. దాదాపు 40 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయని చెప్పారు.
అందుకు తాను, అరియానా చాలా హ్యాపీగా ఉన్నామని, ఎవరెవరైతే ఆ ఇంటర్వ్యూ చూసి సంతోషంగా ఫీల్ కాలేదో వాళ్లందరికీ లవ్ యూ అని తనదైన స్టైల్లో చెప్పారు. అప్పుడప్పుడూ కాస్త చిల్ అవడం నేర్చుకొండని వర్మ సూచించారు. అంతే కాదు.. ఈ సందర్భంగా అరియానా మిక్స్ ఆర్జీవీ అంటూ అదే వీడియో చిన్న చిన్న గిమ్మిక్కులు చేసి మళ్ళీ రిలీజ్ చేస్తున్నామని, ఇది ఇంకో వర్షన్ అని తెలిపారు. చూడండి.. చూసి ఆనందించండి.. దూషించడం లాంటివి కూడా చేయండి.. దానివల్ల కూడా మాకు వ్యూస్ పెరుగుతాయి.. అని ఆర్జీవీ చెప్పుకొచ్చాడు. రాంగోపాల్ వర్మకు, అరియానాకు ఏమైంది ఇవా చేస్తున్నారని అంతా చర్చించుకుంటున్నారు.
My msg to the HATERS of #AriyanaBoldRgv 😍😍😍 and my announcement of #AriyanaMixRgv 😍😍 😍😍😍😍 pic.twitter.com/Jt0h2GcgMg
— Ram Gopal Varma (@RGVzoomin) June 28, 2021