బిజినెస్ డెస్క్- అప్పు.. ప్రభుత్వాల నుంచి మొదలు వ్యాపారవేత్తలు, సామాన్యుల వరకు అప్పు లేనిదే రోజు గడవదు. అవును దేశాలకు దేశాలే అప్పులు చేసి ప్రభుత్వాలను నడుపుతున్నాయి. ఐతే ఎవరి తాహతుకు తగ్గట్టు వారు అప్పులు చేస్తుంటారు. ఇక సామాన్యుల విషయానికి వచ్చే సరికి బ్యాంకుల నుంచి ఎక్కువగా పర్సనల్ లోన్స్ తీసుకుంటారు. తిరిగి ఆ లోన్స్ ను ప్రతి నెల కొంత మొత్తం చెల్లించేస్తుంటారు.
ఇక పర్సనల్ లోన్స్ కు సంబందించి భారతీయ రిజర్వు బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. పర్సనల్ లోన్ లిమిట్ పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ వ్యక్తిగత రుణాల పరిమితిని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇకపై బ్యాంకుల నుంచి పర్సనల్ లోన్ కింద ఎక్కువ మొత్తంలో డబ్బులు లోన్ రూపంలో తీసుకోవచ్చన్నమాట.
ఐతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం అందరికీ వర్తిందు. కొందరికి మాత్రమే ఆర్బీఐ నిర్ణయం వర్తిస్తుంది. బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, బ్యాంక్ చైర్మన్, వీరి కుటుంబ సభ్యులకు వ్యక్తిగత రుణాల పెంపు నిర్ణయం వర్తిస్తుంది. వీరందరూ ఇకపై బ్యాంకుల నుంచి ఎక్కువ మొత్తంలో వ్యక్తిగత రుణాలను తీసుకోవచ్చన్నమాట.
ఇప్పటివరకు వీరికి 25 లక్షల రూపాయల వరకు పర్సనల్ లోన్ తీసుకునే అవకాశం ఉండేదు. ఇప్పుడు ఆర్బీఐ తాజా నిర్ణయంతో వీళ్లు ఏకంగా 5 కోట్ల రూపాయల వరకు పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. అంటే పర్సనల్ లోన్ లిమిట్‌ను 25 రెట్లు పెంచింది ఆర్బీఐ. కానీ వీళ్లంతా ఇష్టానుసారంగా లోన్ తీసుకోవడానిలి లేదు. మేనేజ్మెంట్ కమిటీ ఆమోదం తీసుకుంటేనే ఇంత మొత్తంలో లోన్ తీసుకోవచ్చనే నిబంధనను విధించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.