తమిళనాడు- వివాహ వేడుక ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. ఇద్దరి జీవితాలనే కాదు, రెండు కుటుంబాలను పెళ్లి ఒక్కటి చేస్తుంది. పెళ్లి అనగానే పెళ్లి కూతురే కాదు, పెళ్లి కొడుకు కూడా కాస్త సిగ్గుపడతాడు. ఇక పెళ్లి కూతురైతే పెళ్లిపీఠలపై సిగ్గుపడుతూనే కూర్చుంటుంది. ఇక ఈ కాలం అమ్మాయిలైతే పెళ్లి తంతులో ఏకంగా డాన్స్ కూడా చేసేస్తున్నారు. కాలం మారుతున్న కొద్ది అమ్మాయిల్లోను మార్పు వస్తోంది.
ప్రస్తుతం పెళ్లి వేడుకల్లో సంగీత్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీంతో చాలా చోట్ల పెళ్లి కూతుర్లు సైతం డ్యాన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన ఒక వధువు కత్తి, కర్ర సాము ప్రదర్శనతో అదరగొట్టి అందర్నీ ఔరా అనిపించింది. తమిళనాడులోని తిరుకోలూరు గ్రామానికి చెందిన నిషా, రాజ్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తరువాత జరిగిన ఊరేగింపులో పెళ్లి కూతురు సూపర్ ప్రదర్శన ఇచ్చింది.
చిన్నతనం నుంచి తాను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్‌ను పెళ్లి కూతురి గెటప్‌లోనే ప్రదర్శించింది నిషా. ఆమెకు తోడుగా ఆమె స్నేహితులు కూడా మార్షల్ ఆర్ట్స్‌ను ప్రదర్శించారు. దీంతో పెళ్లి కూతిరి ప్రదర్శనకు అంతా ఫిదా అయిపోయారు. చుట్టూ చప్పట్లు కొడుతూ ఆమెను ఉత్సాహపరిచారు. మహిళల్లో అత్మరక్షణ గురించి అవగాహన కల్పించేందుకే ఈ ప్రదర్శన ఇచ్చానని పెళ్లి కూతురు నిషా తెలిపింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Tamilnadu Bride performance Martial Arts, stuns crowd with ‘Surul Vaal’ (Flexible sword) and Silambam to promote traditional Martials Arts. pic.twitter.com/6VHLiQTI2d
— Pramod Madhav♠️ (@PramodMadhav6) July 1, 2021