దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా.. చలాన్లు వేసినా వాహనదారుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. పైగా రీల్స్ కోసం ఈ మద్య రోడ్లపై రక రకాల విన్యాసాలు చేస్తూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు.
ఇటీవల దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల చేసే పొరపాటు వల్ల ఎంతోమంది అమాయకుల జీవితాలు నాశనం అవుతున్నాయి. లారీలు, కార్లు లాంటి పెద్ద వాహనాలు నడిపే సమయంలో సీటు బెల్టు పెట్టుకోవాలని.. ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ అధికారులు ఎన్నిసార్లు చెప్పినా వాహనదారులు నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారు.. ప్రమదాదాలు కొనితెచ్చుకుంటున్నారు. ఢిల్లీలో ఓ నవ వధువు హెల్మెట్ లేకుండా స్కూటీపై చక్కర్లు కొడుతూ స్కూటీపై హల్ చల్ చేసింది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే..
ఈ మద్య కాలంలో దేశ వ్యాప్తంగా వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ట్రాఫిక్ అధికారులు ఎన్ని ఆంక్షలు పెట్టినా.. ఎన్ని జరిమానాలు విధించినా వాహనదారుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. ఈ మద్య కొంతమంది రీల్స్ కోసం వాహనాలపై చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. ఢిల్లీలో ఓ నూతన వధువు చేసిన హల్ చల్ కి పోలీసులు సరైన బుద్ది చెప్పారు. పెళ్లి దుస్తుల్లో స్కూటీ నడుపుకుంటూ.. మద్యలో చేతులు ఊపుతూ రోడ్డు పై వెళ్లింది. తన డ్రైవింగ్ కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో కి సజ్నాజీ వారీ వారీ పాటను బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిగా యాడ్ చేసింది. ఇంకేముంది ఆ వీడియో కాస్త తెగ వైరల్ అయి పోలీసులు దృష్టిలో పడింది.
ద్విచక్ర వాహనం నడిపే సమయంలో హెల్మెట్ లేకుండా.. ట్రాఫిక్ నిబంధనలు ఏమాత్రం పట్టించుకోకుండా ఢిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టి కొత్త పెళ్లి కూతురుకు పోలీసులు షాకిచ్చారు. ఆ యువతికి ఏకంగా రూ.6 వేల జరిమానా విధించారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపినందుకు రూ.1000, లెసెన్స్ లేనందుకు రూ.5000 మొత్తానికి ఆరువేల రూపాయలు చలానా విధించారు. సదరు యువతి డ్రైవ్ చేసిన వీడియోని ఎడిట్ చేసి మరో పాటు యాడ్ చేసి పోలీస్ అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. రీల్ కోసం ఇలాంటి వీడియోలు తీసి జీవితాన్ని రిస్క్ లో పడేసుకోవొద్దు’ అనే క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
Going ‘Vaari Vaari Jaaun’ on the road for a REEL makes your safety a REAL WORRY!
Please do not indulge in acts of BEWAKOOFIYAN! Drive safe.@dtptraffic pic.twitter.com/CLx5AP9UN8
— Delhi Police (@DelhiPolice) June 10, 2023