టాలీవుడ్ స్టార్ కాంబో అల్లు అర్జున్ – డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడోసారి వస్తున్న సినిమా పుష్ప. ఫస్ట్ టైం ఈ కాంబోలో మాస్ యాక్షన్ పాన్ ఇండియా మూవీగా పుష్ప రాబోతుంది. ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో రిలీజ్ అవుతోంది. ఇప్పటికే పుష్ప పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా పుష్ప మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది.
ఈ ఈవెంట్ లో పుష్పారాజ్ బన్నీతో పాటు హీరోయిన్ రష్మిక మందన స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ముఖ్యంగా రష్మిక స్టేజి పైకి వెళ్లిన తర్వాత ఫ్యాన్స్ కోసం పుష్ప ఆటిట్యూడ్ మాత్రమే కాదు.. ఏకంగా సామీ సాంగ్ కి అదిరిపోయే స్టెప్ వేసి అదరగొట్టింది. ఈ కుర్రభామ జోరుకి ఈవెంట్ లో పాల్గొన్న ఫ్యాన్స్ అంతా హుషారుతో ఊగిపోయారు.
మొదటిగా తన స్పీచ్ ముగించేసిన రష్మిక.. యాంకర్ తో కలిసి పుష్ప ట్రైలర్ లోని తన క్యూట్ డైలాగ్ చెప్పటమే కాకుండా.. అంచనాలు పెంచేసిన సామీ పాటకు హుక్ స్టెప్ వేసి ఆకట్టుకుంది. మొత్తానికి పుష్ప ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో రష్మిక మందన అందరిని ఫిదా చేసిందని చెప్పాలి. ఆల్రెడీ పుష్ప రిలీజ్ కి 5 రోజుల ముందే అడ్వాన్స్ టికెట్ బుకింగ్ ప్రారంభించారు మేకర్స్. ప్రస్తుతం సోషల్ మీడియాలో రష్మిక సామీ డాన్స్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.