రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రధాన మంత్రి రైతు భరోసా సాయానికి సంబంధించిన అప్‌డేట్ రానే వచ్చింది. ఏపీ ప్రభుత్వం 27వ తేదీన రైతుల అకౌంట్లలోకి రైతు భరోసా, ఇన్‌పుట్ సబ్సీడీ డబ్బులను జమ చేయనుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ రైతులకు శుభవార్త చెప్పింది. రైతులకు ఇచ్చే పంట సాయానికి సంబంధించి కీలక ప్రకటన చేసింది. ప్రధాన మంత్రి రైతు భరోసా సాయాన్ని ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు వ్యవసాయ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. అదే విధంగా మాండస్ తుఫాను కారణంగా వందలాది మంది రైతుల పంట నష్టం అయిన సంగతి తెలిసిందే. మాండస్ తుఫాను బాధిత రైతులకు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 76 కోట్ల రూపాయలను అదే రోజున విడుదల చేయనున్నట్లు హరికిరణ్ ప్రకటించారు. వ్యవసాయ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ గురువారం అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు ఇతర సంచాలకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఫిబ్రవరి 28లోగా ఈ క్రాప్, ఈకేవైసీ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మర్చి 5వ తేదీ నాటికి వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి బ్యాంక్ లోన్‌లతో పాటు డీలర్లకు కొనుగోలు ఆర్డర్లు జారీ చేయటం పూర్తి చేయాలని చెప్పారు. కాగా, రైతు భరోసా ఇన్‌పుట్ సబ్సీడీ డబ్బుల పంపిణీ కార్యక్రమం గుంటూరు జిల్లాలో జరగనుంది. ఈ నెల 27న తెనాలిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సభకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరుకానున్నారు. మరి, రైతులకు ఎంతగానో సాయంగా నిలుస్తున్న రైతు భరోసా పథకంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.