ఇప్పటికే కరోనా కారణంగా అస్తవ్యస్తమైన మధ్యతరగతి కుటుంబ ఆర్థిక వ్యవస్థను పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు మోయలేని భారంగా మారాయి. రోజురోజుగా ధర పెరుగుతూ పోతుంటే వచ్చే జీతంలో వాటికి కేటాయించే ఖర్చు చేయిదాటి పోతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు దేశవ్యాప్తంగా అన్నిచోట్ల సెంచరీ కొట్టాయి. కొన్నిచోట్ల లీటర్ పెట్రోల్ ధర 114 రూపాయలకు చేరింది. డీజిల్, వంట గ్యాస్ కూడా భారీ స్థాయిలో పెరిగాయి. కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులపాలైన కోట్లాది కుటుంబాలపై పెట్రోల్,డీజిల్ ధరల పెంపుతో అదనపు భారం పడుతోంది. తాజాగా పెట్రోల్‌పై 31 పైసలు, డీజిల్‌పై 38 పైసలు ధర పెరిగింది. ఈ పెంపుతో దేశంలోని అనేక నగరాల్లో పెట్రోల్ ధర లీటర్‌కి 110 రూపాయలను దాటింది. ఏపీ, తెలంగాణలో పెట్రోల్ ధరలు అమాంతం పెరిగిపోయాయి.
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.08 ఉండగా..డీజిల్ ధర రూ.99.75గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.26 పైసలు పెరిగింది. డీజిల్ ధర 101.28 పైసలకు పెరిగింది. విశాఖలో లీటర్ పెట్రోల్ ధర 107.94 పైసలు ఉండగా…లీటర్ డీజిల్ ధర వందకు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ధర 102.64 పైసలు, ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 108.67 పైసలు, చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర 100.23 పైసలు, బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర 105.95 పైసలకు పెరిగింది. పెట్రోల్, డీజిలే కాదు…వంటగ్యాస్ ధర కూడా సామాన్యుడి నడ్డి విరుస్తోంది. తాజాగా వంటగ్యాస్ సిలిండర్‌పై 15 రూపాయలు పెరిగింది. దీంతో ఢిల్లీలో 14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.899.50కి, హైదరాబాద్‌లో రూ.952కి పెరిగింది. రెండు నెలల్లో వంటగ్యాస్ ధర నాలుగోసారి పెంచారు. ఈ ఏడాది మొత్తం కలిపి వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 205 వరకు పెరిగింది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎన్నడూ లేనంతగా పెరిగాయి. ఈ ప్రభావం సామాన్యులపై పడుతోంది.
గతేడాది ఏప్రిల్‌లో ముడిచమురు ధరలు కనిష్ఠానికి చేరిన పెట్రోల్ ధరలు తగ్గలేదు. పైగా నెలకోసారి పెరుగుతూ వచ్చాయి. ఆ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ తర్వాత క్రమంగా ముడిచమురు ధర పెరుగుతూ తాజాగా 77.50 డాలర్ల ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర సర్కార్ మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. దాంతో ఇంధన ధరలు దేశంలో గరిష్ఠస్థాయికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
ఇదీ చదవండి: హైదరాబాద్ మార్కెట్లోకి బజాజ్ చేతక్ ఈ స్కూటర్, ఒక్కసారి చార్జ్ చేస్తే