సాధారణం చాలామంది కేఫ్ లకు వెళ్లి తమకు ఇష్టమైన వాటిని తింటూ, పానీయాలు తాగుతూ ఎంజాయ్ చేస్తారు. తిన్న తరువాత చివర్లో వాటికి తగిన డబ్బులు చెల్లిస్తాము. ఇందంతా ప్రతి కేఫ్ లో జరిగే సర్వసాధారణ ప్రక్రియ. అయితే ఓ కేఫ్ లో మిగిలిన కేఫ్ లకి భిన్నం ఉంటూ అందరిని ఆకట్టుకుంటుంది. ఆ కేఫ్ లో మిగిలి వాటి మాదిరిగానే మనకు ఇష్టమెచ్చినవి తిన్నొచ్చు.. తాగొచ్చు. జేబుల్లో డబ్బులు లేకున్న అక్కడ హాయిగా తిని రావొచ్చు. అయితే పర్యావరణానికి తూట్లు పొడిచే ప్లాస్టిక్ చెత్తను తీసుకొచ్చి ఇస్తే చాలు. ఇంట్లో ఉండే ప్లాస్టిక్ చెత్తను తీసుకుని ఆ కేఫ్ వెళ్లి.. మనకు నచ్చినవి తినొచ్చు. విన్నడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇలాంటి కేఫ్ ఒకటి ఉంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆ కేఫ్ ఇలాంటి విన్నుత నిర్ణయం తీసుకుంది. మరి.. ఆ కేఫ్ ఎక్కడా? ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒక్కసారి వినియోగానికి పనికొచ్చే ప్లాస్టిక్ ఉత్పత్తులపై జులై 1 నుంచి నిషేధం అమల్లోకి రానుంది. ఈ సందర్భంగా గుజరాత్ లోని జునాగఢ్ ప్రాంతంలో ఈ నెల 30న ప్రారంభం కానున్న ఒక కేఫ్.. కేంద్ర ప్రభుత్వం తీసుకు రానున్న ప్లాస్టిక్ నిషేధాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నానికి సిద్ధమైంది. గురువారం నుంచి ప్రారంభం కానున్న ఈ కేఫ్ కు వెళ్లి మనకు కావల్సింది తిని, కావాల్సిన పానీయం తాగొచ్చు. జేబులో డబ్బుల్లేకపోయినా ఫర్వాలేదు. డబ్బులకు బదులు ప్లాస్టిక్ చెత్తను తీసుకొచ్చి ఇస్తే చాలు. ఇంట్లో ప్లాస్టిక్ చెత్త ఉంటే, ఓ సంచిలో వేసుకుని జునాగఢ్ లోని ఈ కేఫ్ కు వెళ్తే సరి. అర కిలో ప్లాస్టిక్ చెత్తను తీసుకెళ్లి ఇస్తే ఓ గ్లాసు నిమ్మరసం ఇస్తారు. అదే కిలో చెత్త తీసుకేళ్తే.. ఒక పోహ వడ్డిస్తారు. అయితే తీసుకున్న చెత్తను ఏం చేస్తారు అనే సందేహం మనకు రావొచ్చు. ఈ రెస్టారెంట్ సమీకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను కొనుగోలు చేసేందుకు అధికారులు ఒక ఏజెన్సీని నియమించుకున్నారు. వీటిని రీసైక్లింగ్ చేసి ఇతర అవసరాల కోసం ఉపయోగిస్తారు.
జునాగడ్ జిల్లా అధికార యంత్రాంగం చేసిన వినూత్న ప్రయత్నమే ఈ కేఫ్. దీని వల్ల ప్రజల్లో ప్లాస్టిక్ వ్యర్థాలపై అవగాహన సైతం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ కేఫ్ లోని ఆహార పదార్థాల తయారికి సహజసిద్ధంగా పండించిన ముడి సరుకులను వినియోగిస్తుంటారు. సర్వోదయ సాక్షి మండల్ ఈ కేఫ్ నిర్వహణను చూడనుంది. స్వచ్ఛమైన, పరిశుభ్రమైన పట్టణంగా జునాగఢ్ ను తీర్చిదిద్దాలన్నది తమ ప్రయత్నమని అధికారులు చెప్పారు. మరి.. ఈ వెరైటీ కేఫ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Video: అందరూ చూస్తుండగానే.. వరదలో కొట్టుకుపోయిన పోలీస్ స్టేషన్..! వీడియో వైరల్