గుజరాత్ లోని జునాగఢ్ ప్రాంతానికి చెందిన ఓ యువతి స్థానికంగా ఓ యువకుడిని ప్రేమించింది. అయితే, ఇటీవల తల్లిదండ్రులు ఇంట్లో లేని టైమ్ చూసుకుని ఆ యువతి ప్రియుడిని తన ఇంటికి రప్పించుకుంది. ఇక కొద్దిసేపటి తర్వాత ఆ యువతి తల్లి ఇంట్లోకి సడెన్ గా ఎంట్రీ ఇచ్చింది. కూతురుని ప్రియుడితో చూడకూడని స్థితిలో చూసిన తల్లి ఒక్కసారిగా షాక్ గురైంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఈ రోజుల్లో కొంతమంది యువతి, యువకులు తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడుతున్నారు. చదువును పూర్తిగా పక్కనబెట్టి ప్రేమ పేరుతో చెడు తిరుగుళ్లు తిరుగుతున్నారు. ఇక తల్లిదండ్రుల కళ్లు గప్పి ప్రియుడితో సినిమాలు, షికారులు అంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అచ్చం ఇలాగే వ్యవహరించిన ఓ యువతి.. ఇంట్లో తల్లిదండ్రులు లేని టైమ్ లో ప్రియుడుని ఇంటికి రప్పించుకుంది. ఇక బెడ్ రూంలో ప్రియుడితో ఏకాంతంగా ఉండగా సడెన్ గా ఆ యువతి తల్లి ఎంట్రీ ఇచ్చింది. ఈ సీన్ చూసిన తల్లి ఒక్కసారిగా షాక్ గురైంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. గుజరాత్ జునాగఢ్ జిల్లాలోని ఇవ్నాగర్ గ్రామం. ఇక్కడే దక్షా బమనియా అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమెకు మీనాక్షి (19) అనే కూతురు ఉంది. ఈ యువతి మధ్యే 10వ తరగతి ఉత్తీర్ణత సాధించింది. ఇదిలా ఉంటే, ఈ యువతి తల్లిదండ్రుల కళ్లు గప్పి స్థానికంగా ఉండే ఓ యువకుడితో ప్రేమ వ్యవహారం నడిపించింది. సమయం దొరికినప్పుడల్లా చదువు పేరుతో బయటకు వెళ్లి ప్రియుడితో తిరిగేది. ఇకపోతే, ఇటీవల తల్లిదండ్రులు ఇంట్లో లేని టైమ్ చూసిన మీనాక్షి.. తన ప్రియుడిని ఏకంగా ఇంటికే రప్పించుకుంది. అతడు రాగానే ఇంట్లో బెడ్ రూంలో చేయాల్సినవి అన్నీ చేసేశారు.
ఇక ఇదే సమయంలోనే మీనాక్షి తల్లి సడెన్ గా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. కూతురుని ప్రియుడితో చూడకూడని స్థితిలో చూసిన తల్లి ఒక్కసారిగా షాక్ గురైంది. దీంతో వెంటనే మీనాక్షి ప్రియుడు ఇంట్లో నుంచి పరారయ్యాడు. తల్లి మాత్రం కూతురిపై మాటలతో దాడి చేసింది. ఈ విషయాన్ని నాన్నకు చెప్పద్దంటూ మీనాక్షి తల్లిని వేడుకుంది. అయినా మీనాక్షికి నమ్మకం కుదరలేదు. దీంతో ఆ యువతికి ఏం చేయాలో తెలియక తల్లిని హత్య చేయాలని భావించింది. తాను అనుకున్నట్లే ఇంట్లో ఉన్న పదునైన ఆయుధంతో తల్లిని కొట్టి దారుణంగా హత్య చేసింది.
ఇక సాయంత్రం మీనాక్షి తండ్రి ఇంటికి వచ్చి చూడగా భార్య దక్షా బమనియా రక్తపు మడుగులో పడి చనిపోయి కనిపించింది. అతడు షాక్ గురై ఏం జరిగిందో తెలియక వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, హత్య జరిగిన సమయంలో ఇంట్లో ఎవరెవరు ఉన్నారని పోలీసులు తెలుసుకున్నారు.
కూతురు ఇంట్లోనే ఉందని తెలుసుకున్న పోలీసులు ఆ యువతిని ప్రశ్నించారు. నేను అప్పుడు జోరు నిద్రలో ఉన్నానని, నాకేం తెలియదంటూ పొంతనలేని సమాధానాలు చెప్పింది. కానీ, ఎందుకో ఆ యువతి తీరుపై పోలీసులకు అనుమానం వచ్చింది. ఇక గట్టిగా విచారించే సరికి.. మా అమ్మను నేనే హత్య చేశానంటూ తన నేరాన్ని అంగీకరించింది. నా ప్రియుడితో ఇంట్లో ఉండగా చూసిందని, ఎవరికైన చెబుతుందనే భయంతోనే మా అమ్మను హత్య చేశానని తెలిపింది. దీంతో పోలీసులు ఆ యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.