కింగ్ ఆఫ్ ఫ్రూట్‌గా కొలవబడుతుంది మామిడి పండు. కేవలం సమ్మర్ సీజన్లతో దొరికే మామిడి కాయలు, పండ్లను ఎంతో అమితంగా తింటారు. పచ్చళ్లు పట్టడంతో పాటు మామిడి కాయను తురిమి నిల్వ చేయడం వంటివి చేస్తారు.
కింగ్ ఆఫ్ ఫ్రూట్‌గా కొలవబడుతుంది మామిడి పండు. కేవలం సమ్మర్ సీజన్లతో దొరికే మామిడి కాయలు, పండ్లను ఎంతో అమితంగా తింటారు. పచ్చళ్లు పట్టడంతో పాటు మామిడి కాయను తురిమి నిల్వ చేయడం వంటివి చేస్తారు. ఇక బాగా పండిన మామిడి పండ్లను అయితే లాగించేస్తుంటారు. ప్రస్తుతం మామిడి కాయల సీజన్ ముగింపు దశకు వచ్చింది. ఇప్పుడు టాటా, బైబై చెప్పేసి వచ్చే సమ్మర్‌కు కలుస్తానంటోంది. మామిడి కాయలను డజన్లు లేదా కిలోల చొప్పున కొనుగోలు చేస్తుంటారు. డజన్ల చొప్పున ఒక ధర, కేజీల్లో ఒక ధర ఉంటుంది. బంగినపల్లి, రసాలు, నీలం, తోతాపురి ఇవైతే.. వాటి బరువును బట్టి తూగుతుంటాయి. మామూలుగా ఏ రకం మామిడి అయినా కేజీ మామిడి కాయ/పండు ధర ఎంత ఉంటుంది.. మహా అయితే రూ. 80 నుండి రూ. 200 పలుకుతుంది.
కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే మామిడి ధర తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఈ మామిడి కాయ కిలో ధర వందలు, వేలు కాదు.. ఏకంగా లక్షలే. ఆ..అని నోరెళ్లబెట్టకండి. అది నిజం. ఇంతకు అంత గిరాకీ ఉండే పండు ఏంటనుకున్నారు. మియాజాకి రకానికి చెందిన మామిడి పండు అది. అత్యంత ఖరీదైన మామిడి రకాల్లో ఇది ఒకటి. ఈ రకం మామిడి ధర అంతర్జాతీయ మార్కెట్ లో కిలో రూ. 2.5 నుండి రూ. 3 లక్షలు పలుకుతుంది. దీన్ని ఒడిశాలోని కలహండి జిల్లాలో రక్ష్యకర్ భోయ్ అనే రైతు కమ్ ఉపాధ్యాయుడు తన పొలంలో పండిస్తున్నాడు. ఎందుకు అంత ధర అనుకుంటున్నారా.. ఈ మామిడికి ప్రత్యేక రుచి, ఆహార విలువలు ఉండటమేనట. వాస్తవానికి మియాజాకి రకం జపనీస్ జాతికి చెందినది.
ధరమ్‌ఘర్ సబ్‌డివిజన్‌లోని కందుల్‌గూడ గ్రామానికి చెందిన మామిడి రక్ష్యకర్ భోయ్ తన వ్యవసాయ భూమిలో వివిధ జాతుల మామిడిని పండిస్తున్నాడు. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మియాజాకి రకాన్ని పండించాలని అనుకున్నాడు భోయ్. రాష్ట్ర ఉద్యానవన శాఖ ద్వారా విత్తనాన్ని సేకరించిన తర్వాత అతను తన తోటలో ఈ పంటను వేశాడు. మియా జాకిని రెడ్ సన్ అని, బెంగాలీలో సుర్జా డిమ్ అని కూడా పిలుస్తారు. ఈ మామిడి పండుకు భిన్నమైన రంగే కాదూ విలక్షణమైన రుచి, ఔషధ విలువలు ఉండటం వల్ల విదేశాల్లో భారీ డిమాండ్ ఉందట. ఇతర మామిడి రకాల కన్నా పూర్తి భిన్నంగా ఉండే ఈ రకం పండులో విటమిన్ ఎ, సిలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయట. వ్యాధి నిరోధక శక్తి అధికంగా లభిస్తుంది. ఇందులో డైటరీ ఫైబర్, పొటాషియం మరియు మెగ్నీషియం కూడా ఉన్నాయని రైతు రక్ష్యకర్ భోయ్ చెప్పారు.