ఆ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. బంధువులంతా వచ్చి వేడుకలను ఎంజాయ్ చేస్తున్నారు. అటు డీజే సాంగ్ లు ఊదరగొడుతున్నాయి. ఇంకేముందీ కాలు కదపడం మొదలు పెట్టారు. అయితే ఒక్కసారిగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది. హాయిగా సాగుతున్న ఫంక్షన్ లో ఆర్తనాదాలు మిన్నంటాయి.
జీవితం కంటి రెప్పపాటు లాంటింది. జనన, మరణాలు మన చేతుల్లో ఉండవు. పుట్టుకతో పోలిస్తే చావు ఎప్పుడు ఎలా, ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. అప్పటి వరకు ఉన్న మనిషి.. మరి కాసేపట్లో చనిపోతాడని ఊహించలేం. క్షణ కాలంలో మనిషి మనుగడను ప్రశ్నార్థకం చేయగల శక్తి మరణానికి మాత్రమే ఉంది. కరోనా ముందు కన్నా కరోనా తరువాతి పరిస్థితులను అంచనా వేయలేం. గతంలో ఆరవై ఏళ్ల వారికి గుండె పోటు వస్తుంటే.. ఇటీవల ఇటువంటి మరణాలు ఎక్కువగా వింటున్నాం. 45 ఏళ్లలోపు వారే ఎక్కువ మరణిస్తున్నారు. మొన్న10వ తరగతి విద్యార్థి గుండె పోటుతో స్కూల్లోనే కుప్పకూలి చనిపోతే.. ఇటు నటుడు తారకరత్న సైతం గుండెపోటు గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు మరో యువ వ్యాపార వేత్త ప్రాణాలు వదిలాడు.
ఆ ఇంట్లో కోలాహలం నిండుకుంది. అందరూ ఆట, పాటలతో ఎంజాయ్ చేస్తున్నారు. అంతలోనే ఓ వ్యక్తి డాన్స్ చేస్తూ కుప్పకూలిపోయారు. ఈ హఠాత్ పరిణామానికి అక్కడ ఉన్నవారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. హుటాహుటిని ఆసుపత్రిని తరలించిన ఉపయోగం లేకుండా పోయింది. ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కొన్ని నిమిషాల క్రితం ఎంతో సందడి నెలకొన్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. అప్పటి వరకు నవ్వుతూ, తుళ్లుతూ కనిపించిన వ్యక్తి.. విగత జీవిగా మారిపోయాడు. ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
తన మేనకోడలు మొదటి వివాహ వారికోత్సవ వేడుకలు సందర్భంగా యువ వ్యాపార వేత్త అమర్ దీప్ వర్మ పాల్గొన్నారు. ఆ వేడుకలకూ సైతం భారీ అలంకరణ చేశారు. బంధువులంతా వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. సంగీత్‌లో భాగంగా డీజే సౌండ్స్ ఊదరగొడుతున్నాయి. దీంతో వర్మ తనను తాను కంట్రోల్ చేసుకోలేక డాన్స్ చేయడం మొదలు పెట్టారు. తొలుత ఛాతీలో కొంత నొప్పిగా అనిపించగా.. కాసేపు రిలాక్స్ అయ్యారు. తగ్గిందనుకుని భావించిన ఆయన డాన్స్ చేయడం మొదలు పెట్టారు. డాన్స్ చేస్తుండగానే ఒక్కసారిగా నేలకొరిగారు. వర్మ ఒక్కసారిగా పడిపోవడంతో పార్టీలో గందరగోళం నెలకొంది.
అమర్ పడిపోతున్న దృశ్యాన్ని ఒకరు వీడియో తీశారు. ఆయన రెప్పపాటులో కిందపడిపోయిన దృశ్యం కనిపిస్తోంది. ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్ తిన్న బంధువులు ఆయనను తొలుత నజరేత్ ఆసుపత్రి అక్కడి నుండి సరస్వతి హార్ట్ తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన పరిస్థితి దిగజారిపోతుంది. ఊపిరి తీసుకోలేకపోతున్నారు. చివరికీ స్వరూప రాణి ఆసుప్రతికి తీసుకెళ్లగా.. చనిపోయినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కన్నీరుమున్నీరు అయ్యారు. రెప్పపాటు జీవితంలో చావు మనకు చెప్పిరాదనడానికి ఈ ఘటనే ఉదాహరణ. కరోనా తర్వాత మరణాలు ఊహించలేమని మీరూ భావిస్తున్నట్లయితే కామెంట్ల రూపంలో తెలియజేయండి.
డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి చనిపోయాడు pic.twitter.com/XVQbyuJ9ax
— Hardin (@hardintessa143) February 13, 2023