ఈ మద్య చాలా మంది చిన్న చిన్న విషయాలకే ఎమోషన్ అవుతున్నారు.. ఆ సమయంలో విచక్షణ కోల్పోయి ఎదుటి వారిపై దాడులు కూడా చేస్తున్నారు. ఒకప్పుడు మహిళలు వంటింటికి మాత్రమే పరిమితం అయ్యేవారు.. పిల్లలు కని వారి పోషణ, కుటుంబ సభ్యులు బాగోగులు చూసుకోవడంతో జీవితం సరిపోయేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. మహిళలు ఇప్పుడు మగాళ్లతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. సాధారణంగా మహిళలకు ఎంతో ఓపిక ఉంటుందని అంటారు.. కానీ ఇటీవల కొన్ని చోట్ల నడిరోడ్డుపై జట్లు పట్టుకొని కొట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇటీవల ముంబాయి లో ఒక లోకల్ ట్రైన్ లో ఖాళీ సీటు తనకు కావాలంటే తనకు కావాలని ఇద్దరు మహిళలు అందరూ చూస్తుండగా జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. ఎంత మంది ఆపినా వారు మాత్రం కాంప్రమైజ్ కాలేదు.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. తాజాగా జిమ్ లో ఇద్దరు మహిళలు వెయిట్ లిఫ్ట్ కోసం కొట్టుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాకపోతే ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనేదానిపై స్పష్టత లేదు.
జిమ్ లో కొంత మంది మహిళలు ఎక్స్ సైజు చేస్తున్నారు. ఒక మహిళ వెయిట్ లిఫ్ట్ మిషన్ వద్ద తన వంతు కోసం ఎదురు చూస్తుంది. యువతి లేవగానే మహిళ అక్కడకు వెళ్లింది.. అంతలోనే మరో మహిళ వచ్చి ఆమెను పక్కకు తోసి తాను వెయిట్ లిఫ్ట్ వద్ద కూర్చునే ప్రయత్నం చేసింది. అప్పటి వరకు తాను ఎదురు చూసిన వెయిట్ లిఫ్ట్ వద్దకు మరో మహిళ రావడమే కాక తనను తోసివేయడంతో చిర్రెత్తుకొచ్చి ఆమె పై దాడిచేసింది. ఆ మహిళ కూడా ఎదురుదాడి చేసింది.
ఇద్దరూ జట్లు పట్టుకొని కొట్టుకుంటున్న సమయంలో పక్కన ఉన్న మహిళలు వచ్చి వారించేందుకు ప్రయత్నించారు. అయినా అలాగే కొట్టుకున్న ఆ మహిళలను అతి కష్టం మీద విడిచిపించారు. దీనికి సంబంధించిన వీడియో సీసీ టీవీలో రికార్డు అయ్యింది. ఈ వీడియో ఒక యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అయ్యింది. కాకపోతే ఇది ఎక్కడ జరిగిందనే విషయం వెల్లడించలేదు. ఈ వీడియో పై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
Kalesh Inside GYM for Smith Machine pic.twitter.com/KXy6v9UyWj
— r/Bahar Ke Kalesh (@Baharkekalesh) October 9, 2022