ప్రభుత్వాస్పత్రుల్లో సిబ్బంది దురుసుగా ప్రవర్తించడమనేది తరచూ వార్తల్లో చూస్తుంటాం. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో కాదు కానీ కొన్ని ప్రభుత్వాసుపత్రుల్లో కొంతమంది సిబ్బంది రోగుల పట్ల పరుష పదజాలంతో విరుచుకుపడుతుంటారు. ముఖ్యంగా పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తుంటారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి పురుడు పోస్తూనే.. బూతులతో తిడతారు. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవం చేయించుకున్న వారికి ఇది అనుభవం అయ్యే ఉంటుంది. ఇలాంటి ఘటనే ఒక గర్భిణీకి ఎదురయ్యింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆ మహిళ ప్రభుత్వాసుపత్రికి వెళ్తే.. ఆమెకు అడ్మిషన్ ఇవ్వలేదు సిబ్బంది. దీంతో ఆ మహిళ నరక యాతన అనుభవిస్తూ నేల మీదే ప్రసవించింది. డాక్టర్లు లేరు, ఆయాలు లేరు, ఎవరూ లేరు. అందరూ చూస్తుండగానే నొప్పులు భరిస్తూ ప్రసవించింది.
A 38-year-old pregnant woman, who was allegedly denied admission to the labour room, was forced to give birth to her baby girl on the floor of the #Pathankot civil hospital’s corridor
Read more – https://t.co/3QdfFQbNdS pic.twitter.com/cKS1pIwdsH
— HT Punjab (@HTPunjab) September 29, 2022
వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ లోని పఠాన్ కోట్ లో ఉన్న ప్రభుత్వాసుపత్రికి జంగీలాల్ తన భార్యను తీసుకెళ్లాడు. తీరా తీసుకెళ్ళాక ఆ మహిళకు అడ్మిషన్ ఇవ్వలేదు. వాళ్ళని వార్డులోకి కూడా తానివ్వకుండా తలుపులు మూసేశారు. అమృత్ సర్ హాస్పిటల్ కి తీసుకెళ్లమని సిబ్బంది చెప్పాడు. అయితే అప్పటికే ఆమె విపరీతమైన నొప్పులతో బాధపడుతుంది. తన భార్యకి ప్రసవం చేయమని వేడుకున్నా.. హాస్పిటల్ సిబ్బంది కనికరించలేదు. కనీసం మంచమైనా ఇవ్వండి అని అడిగాడు. కానీ ఇవ్వలేదు. దీంతో ఆ మహిళ నేల మీదే పడిపోయి ప్రసవించింది. నొప్పులతో విలవిలలాడిపోయింది. ఆసుపత్రి హాల్లోనే అందరి ముందు నేల మీద ఓ ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో అక్కడున్న జనం ఆమె చుట్టూ గుమిగూడారు. డెలివరీ తర్వాత కూడా ఆ గర్భిణీకి హాస్పిటల్ సిబ్బంది చికిత్స అందించలేదు. దీంతో హాస్పిటల్ సిబ్బంది తీరుపై స్థానికులు, నెటిజన్లు మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.